దేశవ్యాప్తంగా జరుగుతున్న పలురాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో హర్యానాలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకున్నది. రైతుల నిరసనల నేపథ్యం.. సాగు చట్టాలను నిరసిస్తూ ఎల్లెనాబాద్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో వచ్చిన ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతలా, కాంగ్రెస్ అభ్యర్థి పవన్ బెనివాల్, బీజేపీ అభ్యర్థి కాండాల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉన్నది. ఈ ఎన్నికలో ప్రజలూ పెద్దఎత్తున పాల్గొంటున్నది స్పష్టమవుతున్నది. ఉదయం 11 గంటల వరకు 28శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం.
చండీగడ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, Haryana రైతులు నెలలకొద్దీ ఆందోళనలు చేస్తున్నారు. BJPపై విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే హర్యానాలోని Ellenabad నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నది. ఈ ఉపఎన్నికకూ Farm laws కారణంగా ఉన్నాయి. ఐఎన్ఎల్‌డీ ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతలా కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను Assemblyలో వ్యతిరేకించారు. ఆ చట్టాలకు నిరసనగానే ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఎల్లెనాబాద్‌లో Bypoll వచ్చింది. ఈ ఎన్నికలో ఆయనకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్నది. సాగు చట్టాలే కారణంగా జరుగుతున్న Farmers ఆందోళనలతో దద్దరిల్లుతున్న హర్యానాలో ఈ ఉపఎన్నిక దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ ఉపఎన్నిక రైతుల బ్యాలెట్ పవర్‌కు పరీక్ష అనే అభిప్రాయాన్ని వ్యక్తమవుతున్నది.
నిజానికి ఈ ఉపఎన్నికలో ఓడిపోతే సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ నష్టపోయేదేమీ లేదు. కానీ, సాగు చట్టాల నేపథ్యంలోనే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కాగా, ఐఎన్ఎల్‌డీ, కాంగ్రెస్‌లు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఎల్లెనాబాద్ నుంచి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇందులో 11 మంది స్వతంత్ర అభ్యర్థులే. కానీ, గట్టి పోటీ మాత్రం ఈ మూడు పార్టీ అభ్యర్థుల మధ్యే ఉన్నది. పార్టీ జెండాలు పెద్దగా కనిపించకపోయినా, గుట్టుగా క్యాంపెయిన్ జరిగింది.
Also Read: 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు నేడే ఉప ఎన్నిక.., బీజేపీ VS కాంగ్రెస్‌లుగా సాగనున్న పోరు..
2014, 2019లోనూ అభయ్ సింగ్ చౌతలా ఇక్కడ నుంచి గెలుపొందారు. తాజాగా, అభయ్ ఇక్కడి నుంచి నాలుగో సారి పోటీ చేస్తున్నారు. ఆయనకు రైతులు, జాట్‌ల మద్దతు పుష్కలంగా ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థి పవన్ బెనివాల్ పోటీ చేస్తున్నారు. ఈయనకూ జాట్‌ల మద్దతు ఉన్నది. అందుకే బీజేపీ అభ్యర్థి గోవింద్ కాండా జాట్ యేతరుల మద్దతు కోసం తీవ్రంగా శ్రమించింది.
ఇది కాకుండా రైతుల నుంచి బీజేపీ అభ్యర్థి తీవ్ర నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రచారంలో భాగంగా కాండా వెళ్లిన చోట రైతుల నుంచి నిరసన ఎదురైంది. ఇటీవలే ఓ స్థానిక గురుద్వారా నుంచి రైతులు ఆయనను వెళ్లగొట్టారు. గ్రామాల్లోనూ ఆయన వెళ్లినచోట బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇటీవలే సంయుక్త కిసాన్ మోర్చా కలశ్ యాత్ర చేపట్టింది. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల ఛితాభస్మంతో ఎల్లెనాబాద్‌లోని పలుగ్రామాల్లో కలశ్ యాత్ర చేసింది. మొత్తంగా ఇక్కడ రైతులు బీజేపీ వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నారు.
ఈ రోజు ఉదయం ఏడు గంటలకే ఈ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 11 గంటల ప్రాంతానికి 28శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదవుతున్నది.
Also Read: Huzurabad bypoll Live Update: ఈటల కాన్వాయ్ లోని కార్లు సీజ్... పోలీసుల అదుపులో పీఆర్వో
13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా & నగర్ హవేలీలో కలిసి మొత్తం మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన తర్వాత దాదాపు అన్ని అసెంబ్లీ Bypolls జరగాల్సి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.
