కశ్మీర్‌లో ఉగ్రవాదం.. పౌర హత్యలపై సమాధానమివ్వండి.. అమిత్ షా భేటీలో వీటిపైనే చర్చ
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం పతాకస్థాయికి చేరుతున్నది. స్థానిక యువతా ఉగ్రవాదంపై ఆకర్షితం కావడంతో ముప్పు తీవ్రతరమవుతున్నది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌లో భారీగా బలగాలు ఉన్నప్పటికీ, ప్రజలతో సత్సంబంధాల కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఉగ్రవాదం ఎందుకు పెరుగుతున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడి భద్రతా బలగాలను ప్రశ్నించినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: Jammu Kashmirలో Terror Activities పెరుగుతున్నాయి. స్థానిక యువతా ఉగ్రవాదం వైపు ఆకర్షితమవుతున్నది. వీటికితోడు అంతర్జాతీయ సరిహద్దు నుంచి పాక్ వైపు నుంచి Terrorists చొరబాట్లు, కశ్మీర్‌లో పౌరుల హత్యలు.. ఇలా అనేక విధాల్లో ఉగ్రవాదం శృతిమించింది. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో స్థానికేతరులు జీవించాలంటే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో Union Home Minister Amit Shah జమ్ము కశ్మీర్‌కు మూడు రోజుల పర్యటన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం జమ్ము కశ్మీర్‌లో ల్యాండ్ కాగానే ఉగ్రవాదుల దాడిలో మరణించిన జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం జమ్ము కశ్మీర్ సెక్యూరిటీపై ఉన్నతస్థాయి అధికారులతో భేటీ అయ్యారు.
జమ్ము కశ్మీర్‌లో భారీమొత్తంలో బలగాలు మోహరించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ప్రజల చెంతకు చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉగ్రవాదం ఎలా పెరుగుతున్నదనేదానిపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగినట్టు హోం శాఖకు చెందిన ఓ సీనియర్ నేత వివరించారు.
ప్రభుత్వ వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 32 మంది పౌరులు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. ఇదే సంఖ్య గతేడాది మొత్తం 41గా ఉన్నది. ఈ ఏడాది గడిచిన తొమ్మిది నెలల్లో ఉగ్రవాదులే 63 సార్లు ఎన్‌కౌంటర్ ప్రారంభించారు. కనీసం 28 నేరాలకు పాల్పడ్డారు.
జమ్ము కశ్మీర్ అందరికీ సురక్షితమైనది. కానీ, ఇటీవలే ఉగ్రవాదులు పౌరులను హతమార్చిన ఘటనలు కలకలం రేపాయి. ఈ దారుణాలు మైనార్టీలు, స్థానికేతరులకు కశ్మీర్ సురక్షితమైనది కాదు అనే సందేశాన్ని పంపిస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆందోళనకలిగించే విషయం. కాబట్టి, ప్రజలందరికీ జమ్ము కశ్మీర్ సురక్షితమైనది అనే విషయం స్పష్టమవ్వడానికి స్ట్రాటజీ రూపొందించాలనేది కేంద్ర ప్రభుత్వం ఈ చర్చలో పేర్కొంది.
ఎన్‌కౌంటర్లు సుదీర్ఘకాలం జరగడం, టెర్రరిస్టులపై ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో భద్రతా అధికారులను అడిగారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం, స్థానిక యువత ఉగ్రవాదంలోకి చేరడం, పౌరుల హత్యలపై సమాధానాన్ని డిమాండ్ చేశారు.
Also Read: మరో కశ్మీరేతరుడి హత్య.. చాట్ అమ్ముకునే బిహారీ, యూపీ లేబర్‌పై ఉగ్రవాదుల కాల్పులు
97 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారని, ఇందులో 56 మందిని హతమార్చినట్టు భద్రతా బలగాలు హోం మంత్రికి వివరించారు. తుపాకీ కాల్పులు పెరగడమూ స్థానిక యువత హింసాత్మకంగా మారుతున్నట్టు తెలుస్తున్నదని తెలిపారు.
ఈ ఏడాది 14 చొరబాట్లు జరిగినట్టు అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. కానీ, ఎన్‌కౌంటర్లు మాత్రం అంతకు మించి జరుగుతున్నాయి. కాబట్టి, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఓ బ్లూప్రింట్‌ను రూపొందించినట్టు తెలిపారు. ఆ బ్లూ ప్రింట్‌పై భేటీలో అమిత్ షాతో చర్చించినట్టు మరో అధికారి తెలిపారు.