ఢిల్లీ సీఎంకు క‌రోనా సోక‌డం ప‌ట్ల బీజేపీ నేత కపిల్ మిశ్రా స్పందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క‌రోనా సూప‌ర్ స్పైడ‌ర్ అని విమ‌ర్శించారు. ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో ఢిల్లీ సీఎం ప‌ర్య‌టించి సూప‌ర్ స్పైడ‌ర్ గా మారార‌ని అన్నారు.

ఢిల్లీలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. క‌రోనా కేసుల్లో ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉంది. కోవిడ్ -19 డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఢిల్లీలోనే ఎక్కువ‌గా ఉన్నాయి. రోజు వారీగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసే క‌రోనా బులిటిన్ లో ఢిల్లీ నుంచే అధికంగా కేసులు న‌మోద‌వుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. విష‌యంపై ఢిల్లీ సీఎం ట్విట్ట‌ర్‌లో స్పందించారు. త‌న‌కు కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నాన‌ని, దీంతో పాజిటివ్ గా తేలింద‌ని చెప్పారు. త‌న‌తో ఇటీవల స‌న్నిహితంగా మెలిగిన వారంతా.. క‌లిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంద‌రూ టెస్టులు చేయించుకోవాలని కోరారు. 

బుల్లీ బాయ్ యాప్ కేసు.. కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ఢిల్లీ సీఎంకు క‌రోనా సోక‌డం ప‌ట్ల బీజేపీ నేత కపిల్ మిశ్రా స్పందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క‌రోనా సూప‌ర్ స్పైడ‌ర్ అని విమ‌ర్శించారు. ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో ఢిల్లీ సీఎం ప‌ర్య‌టించి సూప‌ర్ స్పైడ‌ర్ గా మారార‌ని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా వ్యాప్తికి సీఎం కార‌ణ‌మ‌వుతున్నార‌ని ఆరోపించారు. యూపీలోని లక్నోలో, గోవాలో, ఇంకా ప‌లు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్నార‌ని, అక్క‌డ క‌రోనా వ్యాప్తి చెందితే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. అర‌వింద్ కేజీవ్రావ్ క‌రోనా సూప‌ర్ స్పైడ‌ర్ అంటూ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. 

ఢిల్లీలో 5,481 కొత్త క‌రోనా కేసులు..
ఢిల్లీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 5,481 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం సాయంత్రం బులిటెన్ విడుద‌ల చేసింది. క‌రోనా వ‌ల్ల ముగ్గురు మృతి చెందార‌ని తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ క‌రోనా కేసులు 14,889 ఉన్నాయ‌ని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో సానుకూలత రేటు కూడా 8.37 శాతానికి పెరిగిందని ప్ర‌భుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన ఏడున్న‌ర నెల‌లో ఇదే అధిక పాజిటివ్ రేటుగా న‌మోదైంది. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీలో మొత్తం 25,113 మంది మృతి చెందారు. క‌రోనా నుంచి 14,23,699 మంది కోలుకున్నారు. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో 2992 కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయి. ప‌ట్ట‌ణంలోని 53 గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లోని ఆక్సిజన్ ట్యాంక్‌లపై టెలిమెట్రీ పరికరాలు అమర్చుతామ‌ని తెలిపింది. క‌రోనా కేసుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కోవిడ్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తుంద‌ని పేర్కొంది. 

పాట్నా మెడిక‌ల్ కాలేజీలో 159 మంది వైద్యుల‌కు క‌రోనా

వారాంతపు కర్ఫ్యూ విధింపు.. 
ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వీకెండ్ కర్ఫ్యూ విధించింది. ఈ విష‌యంలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి స‌త్యేందర్ జైన్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్ర‌జ‌లు ఈ వీకెండ్ కర్ఫ్యూను లాక్ డౌన్ గా భావించ‌వ‌ద్ద‌ని అన్నారు. ప్ర‌జ‌లు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. వీకెండ్ స‌మ‌యంలో పెద్ద‌గా ఎలాంటి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌వ‌ని, అందుకే ఆంక్ష‌లు విధించామ‌ని అన్నారు.