సారాంశం

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాల పెళ్లి రేపు రాజస్తాన్‌లో ఉదయ్‌పూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో జరగనుంది. ఈ వివాహ వేడుక కోసం ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లు ఉదయ్‌పూర్ చేరుకున్నారు.
 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇద్దరూ ఈ రోజు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు విచ్చేశారు. రేపు ఉదయ్‌పూర్‌లో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల వివాహం జరుగుతున్నది. ఈ వివాహ వేడుకకు హాజరు కావడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రోజు ఉదయ్‌పూర్‌కు వచ్చారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ కాగా, పరిణీతి చోప్రా బాలీవుడ్ సినీ నటి. 

వీరి పెళ్లి పెళ్లి కార్య్రక్రమాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రధాన కార్యక్రమం పెళ్లి రేపు ది లీలా ప్యాలెస్‌లో  జరగనుంది. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఇద్దరూ వారి కుటుంబాలతో ఈ రోజు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అనంతరం వారి వారి హోటల్స్‌కు వెళ్లిపోయారు.

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాల ఎంగేజ్‌మెంట్ మే నెలలో ఢిల్లీలో జరిగింది. దీనికి కుటుంబ సభ్యులు సహా రాజకీయ నాయకులు హాజరయ్యారు.

Also Read: ప్రభాస్‌ నేను టీజ్‌ చేసుకున్నాం.. `ఏక్‌ నిరంజన్‌` షూటింగ్‌ సెట్ విషయాలు చెప్పిన కంగనా.. సీక్వెల్‌కి రెడీ !

కజిన్ ప్రియాంక చోప్రా పెళ్లిలో పరిణీతి చోప్రా పాల్గొని సంబురాలు చేసుకున్న విషయం విధితమే. అయితే, ప్రియాంక చోప్రా మాత్రం పరిణీతి చోప్రా పెళ్లికి హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఆమె ముందస్తుగా సోషల్ మీడియాలో ఇద్దరికీ అభినందనలు చెప్పింది. 

వీరి పెళ్లికి రాజకీయ నేతలతోపాటు సనీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.