ప్రభాస్ నేను టీజ్ చేసుకున్నాం.. `ఏక్ నిరంజన్` షూటింగ్ సెట్ విషయాలు చెప్పిన కంగనా.. సీక్వెల్‌కి రెడీ !
గ్లోబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కలిసి `ఏక్ నిరంజన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `ఏక్ నిరంజన్ 2` పై కంగనా స్పందించింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. మనసులో ఉన్నది ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుతుంది. ఎవరినైనా ఎదురిస్తుంది. చాలా సామాజిక విషయాలపై, అలాగే బాలీవుడ్ మాఫియాపై స్పందించింది. అనేక వివాదాలకు కేరాఫ్‌గానూ నిలిచింది. కమర్షియల్ చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో సౌత్ సినిమాలు కూడా చేసింది కంగనా. తెలుగులో ఆమె `ఏక్ నిరంజన్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
ఇందులో ప్రభాస్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా కంగనా రనౌత్ నటించింది. టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. తొలి చిత్రమే డిజప్పాయింట్ చేయడంతో టాలీవుడ్ వైపు చూడలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో మాత్రం మంచి మెమొరీస్ ఉన్నాయని చెప్పింది. తాజాగా ఆ విషయాలపై ఓపెన్ అయ్యింది. కంగనా రనౌత్.
`ఏక్ నిరంజన్` సినిమా షూటింగ్ సెట్‌లో ప్రభాస్‌తో చాలా సరదాగా గడిపినట్టు తెలిపింది. అప్పుడు ప్రభాస్, తాను చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నామని అల్లరి చిల్లరగా ఉండేవాళల్లమని చెప్పింది. సెట్‌లో చాలా ఛిల్ అయ్యామని, అంతేకాదు ఒకరినొకరు సెట్‌లో టీజింగ్ కూడా చేసుకున్నట్టు తెలిపింది కంగనా రనౌత్. అప్పుడు చాలా యంగ్‌గా ఉన్నామని, ఇప్పుడు చాలా మారిపోయినట్టు తెలిపింది. ప్రభాస్ పూర్తిగా కొత్తగా అయిపోయారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగారని వెల్లడించారు.
ఈ సందర్భంగా `ఏక్ నిరంజన్ 2` సినిమా చేస్తే.. అందులో మీరు నటించడానికి సిద్ధమేనా అనే ప్రశ్నకి కంగనా స్పందించింది. తాను సిద్ధంగానే ఉంటానని వెల్లడించింది. సౌత్‌లో నటించేందుకు తాను ఆసక్తికరంగా ఉన్నానని, ఇక్కడి సినిమాలు చేయాలని ఉందని వెల్లడించింది. మంచి స్క్రిప్ట్ లు వస్తే ఇక్కడ నటించాలని ఉందని తన మనసులో మాట చెప్పింది.
తాను ప్రస్తుతం `చంద్రముఖి 2`లో నటిస్తున్న నేపథ్యంలో తానే ఈ పాత్రని అడిగి నటించినట్టు తెలిపింది. `చంద్రముఖి2` దర్శకుడు వాసు వేరే వారియర్ ఫిల్మ్ స్టోరీతో తన వద్దకు వచ్చారని, కానీ అప్పటికే ఆయన `చంద్రముఖి 2`ని స్టార్ట్ చేశారని, అందులో చంద్రముఖి పాత్రకి ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. దీంతో తాను చేస్తానని అడిగి ఇందులో నటించినట్టు వెల్లడించింది కంగనా రనౌత్. పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా నటిస్తున్న `చంద్రముఖి 2` చిత్రాన్ని లైకా పిక్చర్స్ నిర్మించింది. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రమోషనల్ ప్రెస్ మీట్‌ని నిర్వహించారు. ఇందులో కంగనా రనౌత్.. ప్రభాస్‌తో వర్క్ గురించి ఓపెన్ అయ్యింది.