Asianet News TeluguAsianet News Telugu

నేను హిందువును.. గుడికి వెళ్తే మీకు నొప్పేంటి?.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

సాఫ్ట్ హిందూత్వ ఆరోపణలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. నేను హిందువును.. గుడికి వెళ్తే మీకు సమస్య ఏమిటి అని ప్రశ్నించారు. ఇతరులు గుడికి వెళ్తున్నట్టే తానూ వెళ్తున్నారని స్పష్టం చేశారు. తాను గుడికి వెళ్లడంపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదని వివరించారు.

delhi CM arvind kejriwal answers soft hindutva in goa
Author
Panaji, First Published Nov 7, 2021, 7:57 PM IST

న్యూఢిల్లీ: Goa పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం Arvind Kejriwal కీలక వ్యాఖ్యలు చేశారు. AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ సాఫ్ట్ హిందూత్వ పాటిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. గుళ్లు తిరుగుతూ ఆయన సాఫ్ట్ హిందూత్వ(Soft Hindutva) ప్రదర్శిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆయన స్పందించారు.

ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. మీరు గుడికి వెళ్తారా? అని Delhi CM అరవింద్ కేజ్రీవాల్ తిరిగి ప్రశ్నించారు. ‘మీరు వెళ్తున్నట్టే నేనూ గుడి(Temple)కి వెళ్లుతున్నాను. గుడికి వెళ్లడంలో తప్పేముంది? మీరు గుడికి వెళ్లినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుందా..? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వారి సమస్య (సాఫ్ట్ హిందూత్వ అని ఆరోపిస్తున్నవారిని ఉద్దేశిస్తూ) ఏమిటి మరి? గుడికి వెళ్లడంపై అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏముంది? నేను హిందువును కాబట్టి గుడికి వెళ్తున్నాను. నా భార్య గౌరీ శంకర్ ఆలయానికి వెళ్తూ ఉంటుంది’ అని అరవింద్ కేజ్రీవాల్ సమాధానం చెప్పారు.

గోవాలో అమలు చేస్తున్న పథకాలనే ఆప్ ప్రభుత్వం కాపీ చేస్తున్నదని ఇటీవలే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు చెలరేగాయి. గోవా ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్ వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. ‘ప్రమోద్ సావంతే మమ్ములను అనుకరిస్తున్నారు. ప్రజలకు మేము ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పినప్పుడే ఆయన ఉచిత తాగు నీరు ప్రకటించారు. ఎప్పుడైతే మేము ఎంప్లాయిమెంట్ అలవెన్స్ అందిస్తామని ప్రకటించారో.. అప్పుడే ప్రమోద్ సావంత్ 10వేల ఉద్యోగాలను ప్రకటించారు. నేను భక్తుల గురించి మాట్లాడినప్పుడే ఆయన దీనికి సంబంధించిన పథకాన్ని వెల్లడించారు’ అని సమాధానమిచ్చారు.

Also Read: Goa Assembly Polls: మా పథకం వాళ్లదట, ఆయనో పెద్ద కాపీ మాస్టర్.. కేజ్రీవాల్‌పై గోవా సీఎం సెటైర్లు

గోవాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆప్ తనదైన ముద్ర వేయడానికి పని చేస్తున్నది. అందుకే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ తీర రాష్ట్రానికి రెండు రోజుల పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పర్యటనకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన గోవా చేరుకున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో అఖండ విజయం సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా గోవాలో తన విస్తరణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గోవా పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. అంతేకాదు, బీజేపీ బలపడటానికి పరోక్షంగా కాంగ్రెస్సే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీరియస్ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతున్నదని ఆరోపణలు చేశారు.

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో రోస్ట్ చేసిన రైతులు.. మీటింగ్ మధ్య నుంచే తప్పుకున్న ఢిల్లీ సీఎం

అరవింద్ కేజ్రీవాల్‌పై సాఫ్ట్ హిందూత్వ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ గుళ్లు వెళ్తుండటంతో గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపైనా ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం. బీజేపీని కౌంటర్ చేయడానికి ఆప్, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు సాఫ్ట్ హిందూత్వ దారిని అవలంబిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ లిబరల్‌గా ప్రచారం పొందారు. కానీ, తర్వాత ఆయన గుళ్ల సందర్శనలు చేయడంపై ఈ ఆరోపణలు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios