Asianet News TeluguAsianet News Telugu

శరద్ పవార్ కు హత్యా బెదిరింపులు.. ఫోన్ చేసి, చంపేస్తానని హిందీలో హెచ్చరించిన దుండగుడు..

ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ కు గుర్తు తెలియని దుండగుడి నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. తుపాకీతో కాల్చేస్తానని నిందితుడు శరద్ పవార్ ను హెచ్చరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. 

Death threats to Sharad Pawar.. The thug called and threatened to kill him in Hindi.
Author
First Published Dec 13, 2022, 2:27 PM IST

ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌కు మంగళవారం నాడు హత్యా బెదిరింపులు వచ్చాయి. సిల్వర్ ఓక్ నివాసంలో ఉన్న ఫోన్ కు ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్ చేశాడు. శరద్ పవార్ ను తుపాకీతో కాల్చేస్తానని హెచ్చరించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. ‘‘ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ సిల్వర్ ఓక్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 294,506(2) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.’’ అని ఏఎన్ఐ పేర్కొంది.

మోడీ పాలనలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించబడలేదు.. కాంగ్రెస్ పై కేంద్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు..

శరద్ పవార్ కు ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ చంపేస్తానని బెదిరించాడు. అదే నెంబర్ నుంచి దాదాపు 20 నుంచి 25 కాల్స్ వచ్చాయి. కాగా..  ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించామని, అతడు బీహార్ వాసి అని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే వ్యక్తి శరద్ పవార్‌కు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఆ ఘటనలో అంతకు ముందే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం విడుదల చేశారు. కాగా.. తాజా కేసులోనూ నిందితుడిని పోలీసులు త్వరలో అదుపులోకి తీసుకోనున్నారు.

‘హత్యకు గురైన’ మహిళ అరెస్టు.. ఆమెను ‘చంపిన’ భర్తకు బెయిల్.. అసలేం జరిగిందంటే?

ఇదిలా ఉండగా కొంత కాలం కిందట కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. భారత్ జోడో యాత్ర సందర్భంగా ాయన నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఖల్సా కాలేజీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆ ప్రదేశంలో బాంబు పెట్టామని లేఖ ద్వారా బెదిరింపు వచ్చింది. ఇండోర్‌లోని ఓ దుకాణంలో లేఖ దొరికింది. ఈ బెదిరింపు లేఖ కవర్‌పై రత్లాం బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్ పేరు రాశారు. ఈ లేఖలోనే కమల్‌నాథ్‌ను కూడా బెదిరించారు.

దీనిపై బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్ స్పందించారు. ఆ లేఖకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. తన పరువు తీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఈ బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే స్థానిక ఎస్పీ, ఇండోర్ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios