Asianet News TeluguAsianet News Telugu

మోడీ పాలనలో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించబడలేదు.. కాంగ్రెస్ పై కేంద్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు..

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. పార్లమెంట్‌లో భారత్-చైనా ఘర్షణ అంశంపై విపక్షాల ఆందోళనపై మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Didnt cede an inch of land: Amit Shah on India-China clash at Arunachal LAC
Author
First Published Dec 13, 2022, 2:09 PM IST

ఇండియా చైనా సరిహద్దులో ఘర్షణ: ఇటీవల అరుణచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌లో ఇండో-చైనా సైనికుల మధ్య  హింసాత్మక ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పరంగా హీట్ పెరిగింది. పార్లమెంట్‌లోనూ ఈ విషయం ప్రతిధ్వని వినిపిస్తోంది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా కబ్జా కాలేదని స్పష్టం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై  కాంగ్రెస్ రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.

ఇవాళ లోక్‌సభలో ప్రతిపక్షం ప్రశ్నోత్తరాల సమయాన్ని అనుమతించలేదన్నారు. ఈ చర్యను తాను ఖండిస్తున్నాననీ, ఈ (తవాంగ్ ఫేస్‌ఆఫ్) అంశంపై రక్షణ మంత్రి పార్లమెంటులో ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టంగా చెప్పారు. అయితే కాంగ్రెస్, విపక్షాలు అంగీకరించలేదని అన్నారు. తవాంగ్ సెక్టార్‌ ఘటనను ప్రస్తవిస్తూ.. భారత సైనికులు కొద్దిసేపటికే చైనా సైనికులను తరిమికొట్టారనీ. భారతదేశంలోని ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించబడలేదని అన్నారు. 

ఈ క్రమంలో అమిత్ షా.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్‌కు చైనాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. చైనాపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఉందన్నారు. నెహ్రూకు చైనాపై ఉన్న ప్రేమ వల్లే భద్రతా మండలిలో భారత్‌ సభ్యత్వం బలి అయిందని కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. 1962లో చైనా వేల హెక్టార్ల భూమిని లాక్కుందని అన్నారు.  కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన అమిత్ షా.. చైనా నుంచి కాంగ్రెస్‌కు భారీ మొత్తం వస్తోందన్నారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి డబ్బు వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. 2005-2007 ఆర్థిక కాలంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుండి రూ. 1.35 కోట్ల గ్రాంట్‌ని పొందిందని, FCRA ప్రకారం ఇది సరైనది కాదని అన్నారు. కాబట్టి చట్టపరమైన ప్రక్రియను మంత్రిత్వ శాఖ హోమ్ అఫైర్స్ నమోదు చేసిందని తెలిపారు. చైనా బెదిరింపుతో సరిహద్దులోని డెమ్‌చోక్‌లో రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. అంతకుముందు.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భారత్-చైనా సైన్యం మధ్య జరిగిన వాగ్వివాదంపై రక్షణ మంత్రి పార్లమెంటులో ప్రకటన ఇస్తారని స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ పార్లమెంటుకు అంతరాయం కలిగింది.
 
తవాంగ్‌ సెక్టార్‌ లో దాడి..

అరుణచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌ సెక్టార్‌ లో  గాల్వాన్‌ సీన్‌ మళ్లీ రిపీట్‌ అయ్యింది. భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైనికులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. ప్రత్యర్థి సైనికులను తరిమికొట్టారు. ఇరు దేశాల సైనికుల మధ్య పరస్పర దాడుల్లో నెత్తురు పారింది. ఈ ఘటనను డిసెంబర్‌ 9న భారత సైన్యం ధృవీకరించింది. ఈ పోరాటంలో అనేక మంది సైనికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆర్మీ ఆస్పత్రిలో 9 మంది భారతీయ సైనికులకు చికిత్స జరుగుతోందని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios