మాటలు రావు..వినిపించదు.. కానీ పెద్ద కామాంధుడు.. వీడియో కాల్స్‌తో మహిళలకు వేధింపులు

deaf and mute person harassment against two women
Highlights

పుట్టుకతోనే మాటలు రాని... చెవులు వినిపించని ఓ వ్యక్తి ఇద్దరు మహిళలకు అసభ్యకరంగా సందేశాలు పంపడంతో పాటు నగ్నంగా వీడియో కాల్స్ చేస్తుండటంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అతనికి మాటలు రావు.. రెండు చెవులు వినిపించవు.. ఇతని స్థితి చూసి జాలిపడ్డారో అంతకంటే పెద్ద తప్పు మరోకటి ఉండదు. అమోల్ గైక్వాడ్ అనే 27 సంవత్సరాల యువకుడికి పుట్టుకతోనే మాటలు రావు.. చెవులు వినిపించవు. బతుకు తెరువు కోసం హోటల్‌లో పనిచేస్తున్నాడు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే అతని బుద్ధి గడ్డి తింది. వాట్సాప్ గ్రూప్‌లో ఇద్దరు మహిళల నంబర్లు సంపాదించాడు..

తొలుత అసభ్యకర సందేశాలు పంపుతూ వారిని వేధించేవాడు. అనంతరం బట్టలు విప్పేసి ముఖానికి మాస్క్ తగిలించుకుని.. నగ్నంగా ఉండగా వీడియో కాల్స్ చేసి విసిగించేవాడు.. మాటలు రావుకాబట్టి... విచిత్రమైన సైగలు, ఎమోజీ క్లిప్పులతో సదరు మహిళలను వేధింపులకు గురిచేసేవాడు.. అతని వేధింపులు భరించలేక వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు అహ్మద్‌నగర్‌లో అరెస్ట్ చేసి ఇండోర్‌కు తరలించారు. అమోల్‌పై ఐటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

loader