రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దులో దారుణ హత్య.. మణికట్టు నరికి.. బారికేడ్‌కు వేలాడుతూ.. డెడ్‌బాడీ
రైతులు ఆందోళనలు చేస్తున్న సింఘు సరిహద్దు సమీపంలో ఓ దారుణ హత్య జరిగింది. మణికట్టు నరికేసి, చేతులు, కాళ్లకు కత్తిదాడులతో రక్తం కారుతున్న ఓ మృతదేహం పోలీసు బారికేడ్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ చిత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నది. దీనిపై పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ హత్యతో అటు రైతు నిరసనకారుల్లోనూ ఆందోళన రేగింది.
న్యూఢిల్లీ: సింఘు సరిహద్దు.. ఇప్పుడు ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా సుపరిచితం. ఏడాదికి మించి రైతులు ఇక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఓ దారుణ murder వెలుగులోకి వచ్చింది. మణికట్టు నరికేసి, చేతులు, కాళ్లకు కత్తిపోట్లు, బారికేడ్‌ను తలకిందులు చేసి దానికి వేలాడదీసి అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ dead body కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. చంపినవారూ ఎవరనేదీ ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య అటు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై నిరసనలు చేస్తున్న రైతుల్లోనూ ఆందోళనలను, అలజడిని కలిగిస్తున్నది. ఈ వ్యక్తిపై దాడి జరుగుతున్నప్పటి ఓ వీడియో వైరల్ అయింది.
ఈ ఘటన వివరాలు తెలియగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ హన్స్‌రాజ్ ఈ ఘటనపై మాట్లాడారు. ‘ఈ రోజు ఉదయం barricadeకు వేలాడుతున్న ఓ డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ చేతులు, కాళ్లను కత్తితో నరికేశారు. రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ మృతదేహం వెలుగులోకి వచ్చింది. వైరల్ వీడియోపై దర్యాప్తు చేయాల్సి ఉన్నది. ఇప్పటికే చాలా రకాల వదంతులు ప్రచారంలోకి వస్తున్నాయి’ అని అన్నారు.
Also Read: బీజేపీకి వరుణ్ గాంధీ మరో షాక్: వాజ్‌పేయ్ వీడియోను పోస్టు చేసిన ఎంపీ
సిక్కుల వారియర్ గ్రూప్‌గా పేర్కొనే nihangs ఈ పనిచేసి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి. haryanaలోని సోనీపాట్ జిల్లా కుండ్లీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. హత్యకు గురైన వ్యక్తి చేతులు నరికేసినట్టు(chopped off)గా ఆ వీడియో చూపిస్తున్నది. రక్తం నేలపై పడుతున్నది. ఆయన కళ్లు నొప్పితో, షాక్‌తో మూసుకుపోతున్నాయి. ఆ సమయంలో కొందరు నిహంగ్స్ ఆయన చుట్టూ కనిపించారు. కొంతమంది ఈటెలు, ఇతర ఆయుధాలు పట్టుకుని ఆ బాడీ చుట్టూ తిరుగుతున్నట్టు వీడియో చూపించినట్టు ఓ కథనం పేర్కొంది. ఆయన పేరు, స్వగ్రామం వివరాలను ఆ నిహంగ్స్ అడుగుతున్నట్టు వీడియోలో వినిపించిందని వివరించింది. అయితే, అక్కడున్న వారిలో ఒక్కరూ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయలేదని తెలిపింది.
మరో వీడియోలో ఆ వ్యక్తి మృతదేహాన్ని తలకిందులుగా వేలాడదీసినట్టు చూపించింది. కాళ్లు, రెక్కలు ఆ బారికేడ్ కట్టేసి తలకిందులు చేశారు. ఆ వ్యక్తి చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.
సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిత్‌ను అవమానపరిచినందుకు ఆ గుర్తు తెలియని వ్యక్తిని నిహంగ్స్ హతమార్చినట్టు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి ఓ పోలీసు బారికేడ్‌కు వేలాడదీశారని, ఆ తర్వాత ఆయన మణికట్టు నరికేసి ఉంటారని ఆ ఆరోపణలు పేర్కొంటున్నాయి.
Also Read: దేశాన్ని సర్కారీ తాలిబాన్ ఆక్రమించుకుంది: రైతులపై లాఠీ చార్జ్‌ను ఖండించిన రాకేశ్ తికాయత్
ఈ ఘటనపై రైతు ఆందోళనకారుల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా త్వరలో ఓ ప్రకటన విడుదల చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు భేటీ కానున్నారు. ఆ సమావేశంలో ఘటనపై చర్చించనున్నట్టు తెలిసింది. అనంతరం ఈ ఘటనపై ఓ ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.