ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఉరి తేదీని మరింత ఆలస్యం చేయడానికి నిర్భయ దోషులు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ.. ఉరితీదీని పొడిగిస్తున్నారు. ఇప్పటికే ఉరి తేదీ రెండు సార్లు వాయిదా పడగా... తాజాగా మరోసారి వాయిదా వేయించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ బుధవారం క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. దానిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం దానిని కొట్టివేసింది. న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యలతో కూడిన ధర్మాసనం ఈ క్యురరేటివ్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఆ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు చెప్పింది.

Also Read మరో ట్విస్ట్: నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ మెర్సీ పిటిషన్...
 
అక్షయ్ కుమార్ తన విధించిన ఉరిశిక్షణను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇదిలా ఉంటే నిర్భయ దోషి వినయ్‌ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను బుధవారం పిటిషన్‌ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు.

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి ఖరారయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది.

రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు. 2012లో నిర్భయపై నిందితులు ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన సంగతి తెలిసిందే.