ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల దళిత యువకుడిని నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్‌లతో కొట్టడంతో మృతిచెందాడు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. నాల్గో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొడుకు పుట్టినప్పుడు విందు ఏర్పాటు చేయలేదని 24 ఏళ్ల దళిత వ్యక్తిని దారుణంగా ఇనుపరాడ్లతో కొట్టారు. దీంతో అతను మృతి చెందాడు. వివరాల్లోకి వెడితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ వ్యక్తి తన కొడుకు పుట్టినప్పుడు విందు, మద్యం ఏర్పాడు చేయలేదు. కొంతమంది వీటికోసం డిమాండ్ చేశారు. ఆ తరువాత నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్‌లతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో మరణించాడు. పోలీసులు మంగళవారం వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

జిల్లాలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపర్తర గ్రామానికి చెందిన సచిన్‌పై జూలై 11న దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని బరేలీలోని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ చికిత్స తీసుకుంటూ మంగళవారం మరణించాడని పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. 

బెట్టింగులకు అలవాటు పడి.. భార్యతోనే స్నేహితుడికి హనీట్రాప్.. లక్షలు దోచుకుని.. చివరికి...

మంగళవారం, సచిన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, అదే గ్రామానికి చెందిన విశాల్, అక్కు, ఆకాష్, కల్లు అనే నలుగురిపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని, విశాల్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.

కేసు వివరాలను తెలియజేస్తూ, జూలై 11న, విశాల్, అతని సహచరులు ఇనుప రాడ్లతో, ఆయుధాలతో సచిన్ ఇంట్లోకి ప్రవేశించి, తన కొడుకు పుట్టిన రోజున విందు ఇవ్వమని అడిగారని పోలీసు అధికారి తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా సచిన్ నిరాకరించడంతో, వారు తమకు మద్యం కావాలని అడిగారు. మళ్లీ నిరాకరించడంతో, వారు సచిన్‌ను అతని ఇంటి నుండి బయటకు లాగి, కట్టేసి, ఇనుప రాడ్‌లతో కొట్టారని పోలీసు అధికారి తెలిపారు.