Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. దళిత బాలికను బంధించి, కాళ్లపై కొడుతూ.. థార్డ్ డిగ్రీ లెవల్లో టార్చర్..

నొప్పితో బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా ఎలాంటి కనికరం చూపలేదు ఆ కర్కోటకులు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంత పాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మీద అమేఠీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

dalit girl tortured by a family, accused of theft in amethi video goes viral
Author
Hyderabad, First Published Dec 30, 2021, 7:12 AM IST

అమేథీ : Uttar pradesh లోని అమెథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం అభాండం వేసి ఓ దళిత బాలికను ఓ కుటుంబం Torture పెట్టింది. ఆ అభాగ్యురాలిపై ఇష్టారీతిన దాడి చేశారు. దొంగతనం ఎందుకు చేశావంటూ.. బాలికను ఇంట్లో కింద పడుకోబెట్టి కాళ్లను ఓ stickపై పెట్టి మరో కర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించిన video ఒకటి వెలుగులోకి రావడం షాక్ కు గురి చేస్తోంది. 

నొప్పితో బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా ఎలాంటి కనికరం చూపలేదు ఆ కర్కోటకులు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంత పాడటం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మీద అమేఠీ ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

దళిత బాలిక మీద జరిగిన దాడిని కాంగ్రెస్ ప్రధాన నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 34 కులపరమైన నేరాలు, మహిళలపై 135 నేరాలు నమోదవుతున్నప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగం నిద్రపోతోందని మండిపడ్డారు.

ఈ కేసులో బాధ్యులను 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే ఆందోళనకు దిగుతామని యూపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. అమేఠీ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. నిందితులమీద కేసు నమోదు చేసినట్లు సీఐ అర్పిత్ కపూర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. పోక్సో చట్లం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద పలువురి మీద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన నమన్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. 

రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష.. జడ్జీపైకి చెప్పు విసిరిసన దోషి

కాగా, డిసెంబర్ 29న తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మరో ఘటనలో ఓ దళిత బాలిక mental condition బాగోలేదు. ఏ విషయాన్నీ ఎవ్వరితోనూ చెప్పుకోలేని పరిస్థితి ఆమెది. ఇదే అదనుగా భావించిన ఏడుగురు మృగాళ్లు ఆ బాలిక మీద ఏడు నెలలుగా Sexual assaultకి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన Nallagonda district మర్రిగూడ మండల కేంద్రం నుంచి చౌటుప్పల్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 

సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ దళిత దంపతులు Workersగా పనిచేస్తే జీవనోపాధి పొందుతున్నారు. వారికి మానసిక స్థితి సరిగాలేని ఓ కుమార్తె (16) ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన ప్రభుత్వ చిరుద్యోగి ఒకడు బాలిక ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ తరువాత మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని తాగిన మైకంలో గ్రామానికి చెందిన తోటి స్నేహితులతో పంచుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు కూడా ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఏడు నెలలుగా ఏడుగురు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఆ బాలిక ఆరోగ్యం క్షీణించి, నీరసిస్తుండడంతో.. ఈ పరిస్థితిని గమనించిన తల్లి స్థానిక వైద్యుడు వద్దకు తీసుకువెళ్లింది.

ఆ బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని నిర్థారించాడు ఇది విని తల్లి షాక్ అయ్యింది. ఆ తరువాత కూతురితో ఇంటికి చేరుకుని.. మూడు రోజులుగా తల్లిదండ్రులు, మేనమామ, బంధువులు బాలికను రకరకాలుగా ప్రశ్నించారు. చివరికి బాలిక గ్రామానికి చెందిన ఏడుగురు తన మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని వివరించగలిగింది. 

దీంతో ఆమె కుటుంబ సభ్యులు నిందితులు ఏడుగురిని పట్టుకుని రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇందుకు తామేమీ బాధ్యులం కాదని ఆ ఏడుగురు చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాధిత బాలిక ఇంటివద్దనే ఉండగా, ఈ ఘటన మీద పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని చెబుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios