Asianet News TeluguAsianet News Telugu

రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష.. జడ్జీపైకి చెప్పు విసిరిసన దోషి

రేప్ కేసులో జీవిత ఖైదు శిక్ష విధించడంతో ఆ దోషి న్యాయమూర్తిపైనే చిందులు వేశాడు. అంత తీవ్రమైన శిక్ష విధించడంతో జడ్జీపైకి షూ విసిరాడు. అదృష్టవశాత్తు ఆ షూ న్యాయమూర్తికి దూరంగా వెళ్లింది. విట్‌నెస్ బాక్స్ దగ్గర పడింది. ఏప్రిల్ 30న 27 ఏళ్ల సుజీత్ సాకేత్ ఐదేళ్ల చిన్నారిని చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేశాడు. రేప్ చేసి ఆ తర్వాత ఉరి వేసి హతమార్చాడు.

rape case convict throw shoe at court judge
Author
Ahmedabad, First Published Dec 29, 2021, 5:16 PM IST

అహ్మదాబాద్: Gujaratలోని ఓ Courtలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. తనకు యావజ్జీవిత కారాగార శిక్ష(Life time Imprisonment) వేశారని హత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఏకంగా న్యాయమూర్తిపైనే ఆగ్రహించాడు. తన చెప్పు(Shoe) తీసి జడ్జీ(Judge)పైకి విసిరేశాడు. అదృష్టవశాత్తు అది టార్గెట్ మిస్ అయి.. విట్‌నెస్ బాక్స్ దగ్గర పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చోటుచేసుకుంది.

ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, ఆమె హత్య కేసులో దోషిగా తేలిన సుజీత్ సాకేత్‌కు పోక్సో కోర్టు యావజ్జీవ ఖైదు శిక్ష విధించింది. కానీ, ఈ తీర్పు అతనిలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తీర్పును సహించలేదు. ఆ ఆగ్రహంతోనే తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్ కాలాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెప్పును విసిరాడు. విచారణ ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సుజీత్ సాకేత్‌ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటిలో ఒంటరిగా కనిపించిన ఐదేళ్ల చిన్నారిపై కన్నేశాడు. చాక్లెట్‌తో ఆశ చూపి ఇంటి బయటకు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి బాలికను రేప్ చేశాడు. అనంతరం ఉరి వేసి హతమార్చాడు. ఏప్రిల్ 30న ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక కుటుంబం వలస వచ్చిన కుటుంబం.

Also Read: భర్తతో గొడవపడి అర్థరాత్రి బైటికి వచ్చిన భార్య.. లిఫ్ట్ ఇచ్చి నరకం చూపించిన కుర్రాళ్లు...

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చార్జిషీట్ దాఖలైంది. కోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. కోర్టు మొత్తం 26 మంది సాక్షుల వాంగ్మూలాలను తీసుకుంది. మరో 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను పరిశీలించింది. ఆ తర్వాతే ఈ కేసులో సుజీత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారించింది. శిక్షనూ విధించింది. సుజీత్ సాకేత్ బతికినన్ని రోజులు జైలు శిక్ష అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో సుజీత్ సాకేత్ రగిలిపోయాడు. న్యాయమూర్తిపై మండిపడ్డాడు. షూ తీసి జడ్జీపైకి విసిరాడు. అదృవష్టవశాత్తు ఆ చెప్పు న్యాయమూర్తి దగ్గరకు వెళ్లలేదు. అక్కడే ఉన్న విట్‌నెస్ బాక్స్ సమీపంలో పడిపోయింది.

మహారాష్ట్రలోనూ ఇటీవలే ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. గత మే నెలలో మహారాష్ట్రలోని థానె జిల్లా కోర్టులో న్యాయమూర్తిపైకి ఓ నిందితుడు చెప్పు విసిరాడు. భార్య, తల్లి హత్య కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తి కోపంతో న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు.

Also Read: తొమ్మిదేళ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్ ఆశచూపి....

ఈ ఏడాది వినాయకచవితి రోజున చిప్స్ ప్యాకెట్ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై నిందితుడు రాజు హైదరాబాద్‌లో అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై  కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులపై లాఠీచార్జీ చేసి చిన్నారి మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 8 గంటల  ఆందోళన తర్వాత  స్థానికులు ఆందోళనను విరమించారు. 

అనంతరం రాజు కోసం దాదాపు వేయి మంది పోలీసులు గాలింపు చేపట్టారు. వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. రాజు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios