Asianet News TeluguAsianet News Telugu

తుఫాను మాండూస్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీకి భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటి సాయంత్రం వరకు తుఫానుగా మారే అవకాశం ఉంది. దీనికి  మాండూస్ తుఫాన్ అని నామకరణం చేశారు. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 

Cyclone Mandaus.. Heavy rain forecast for Tamil Nadu, AP for three days from tomorrow..
Author
First Published Dec 6, 2022, 2:11 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  ‘మాండూస్’ అనే పేరును సూచించింది. ఈ తుఫాను ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శృంగారానికి మైనర్ బాలిక సమ్మతించినా... అది అత్యాచారమే: ఢిల్లీ హైకోర్టు

బుధవారం సాయంత్రం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కరూర్, ధర్మపురిలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. అయితే శుక్రవారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగవచ్చు. చెన్నై, దాని పొరుగు జిల్లాల్లో తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉంది.

వివాదాస్పదంగా మారిన ‘చేపల కూర’ వ్యాఖ్యలు.. బాలీవుడ్ నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు..

గురువారం నాటికి తమిళనాడులో తుఫాను తీర ప్రాంతానికి చేరుకోవడంతో వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కల్లకురిచి, కడలూరు, అరియలూరు, పెరంబలూరు, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం, పుదుచ్చేరి, కరైకల్ కేంద్రపాలిత ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తమిళనాడు వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడులోని పుదుకోట్టై, విల్లుపురం, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం జిల్లాలకు మంగళవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios