Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలకూ స్మశానవాటిక

 దేశ రాజధాని డిల్లీలోని పిటోర్నిలో పెంపుకు కుక్కలను దహనం చేసేందుకు ప్రత్యేక స్మశానవాటికను ఏర్పాటుచేశారు.

Cremation facilities for Dogs In Delhi
Author
New Delhi, First Published Oct 8, 2020, 7:38 AM IST

న్యూడిల్లీ: ఎంతో ప్రేమగా తమ కుటుంబసభ్యుల మాదిరిగా చూసుకున్న పెంపుడుకుక్కలు చనిపోతే వాటిని ఎక్కడ వేయాలో కూడా తెలియని పరిస్ధితి. మున్సిపల్ సిబ్బందికి కూడా వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ సమస్య లేకుండా డిల్లీ జంతు ప్రేమికులకు ఓ స్వచ్చంద సంస్థ ఓ శుభవార్త అందించింది. 

దేశ రాజధాన్ని డిల్లీలోని పిటోర్నిలో పెంపుకు కుక్కలను దహనం చేసేందుకు ప్రత్యేక స్మశానవాటికను ఏర్పాటుచేశారు.  ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో డిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఈ ఏర్పాటు చేసింది. బుధవారం డిల్లీ మేయర్ అనామికా ఈ జాగిలాల శ్మశానవాటికను ప్రారంభించారు. 

ఎంతో ఇష్టంగా పెంచుకున్న జాగిలాలు చనిపోయి బాధలో వున్నవారికి స్వాంతన  కలిగించేలా పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్న ఈ శ్మశానవాటికలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దాదాపు గంట వరకు తమ పెంపుడు కుక్కులను గౌరవప్రదంగా దహనం చేసకోవచ్చని డిల్లీ మేయర్ వెల్లడించారు. 

ఇక వీధికుక్కల కోసం కూడా ఓ రెస్క్యూ అంబులెన్స్ ను కూడా మేయర్ ప్రారంభించారు.  గాయపడి, అనారోగ్యంతో వున్న వీధి కుక్కలకు చికిత్స అందించడానికి వీలుగా ఈ అంబులెన్స్ ను సిద్దం చేసినట్లు...గాయాలు తగ్గిన తర్వాత శునకాలను తిరిగి వదిలిపెడతారని మేయర్ అనామిక తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios