Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల వద్ద 2.కి.మీ.ల మేర క్యూలు.. కోవిడ్ ఆంక్షలతో ఇక్కట్లు...

‘కొత్త ఆంక్షల కారణంగా మేం వెళ్లాల్సిన సమయం కంటే 2 గంటలు ముందే ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తోంది. అయినా కూడా ఇక్కడ రద్దీగానే ఉంటోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది’ అని ప్రయాణికులు తమ ఇబ్బందిని చెబుతున్నారు. 

Covid19 Restrictions In Delhi : Long Queues In Metro Stations With New Norms In Place
Author
Hyderabad, First Published Dec 29, 2021, 2:12 PM IST

ఢిల్లీ : కొత్త వేరియంట్ Omicron ఉద్ధృతి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. Night curfewతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్ లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక, మెట్రో రైళ్లు, బస్సులను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అయితే, కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం పలు Bus stops, metro stations వద్ద ప్రయాణికులు బారులు తీరి కన్పించారు. ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్టాప్ లు , మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉండటం గమనార్హం. 

‘కొత్త ఆంక్షల కారణంగా మేం వెళ్లాల్సిన సమయం కంటే 2 గంటలు ముందే ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తోంది. అయినా కూడా ఇక్కడ రద్దీగానే ఉంటోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది’ అని ప్రయాణికులు తమ ఇబ్బందిని చెబుతున్నారు. 

ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం.. తగ్గిన వాయు కాలుష్యం..

ఇదిలా ఉండగా, రద్దీ నేపథ్యంలో కొందరు Corona rulesను గాలికొదిలేస్తున్నారు. చాలా స్టేషన్ల వద్ద ప్రయాణికులు కనీసం మాస్కులు కూడా ధరించకుండా కన్పించారు. భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్తా తగ్గింది. దీంతో ఢిల్లీ వాసులకు కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ల‌య్యింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) బుధ‌వారం విడుద‌ల చేసిన  తాజా అంచ‌నాల ప్ర‌కారం.. గాలి నాణ్య‌త 347 AQI నుంచి 286 AQIకి వ‌చ్చింది. అంటే ఢిల్లీలో ఇంకా పూర్తిగా గాలినాణ్య‌త మెరుప‌గ‌ప‌డలేదు. కానీ ‘‘ వెరీ పూర్’’ కేటగిరి నుంచి ‘‘పూర్’’ కేటగిరికి మారింది. ఇది ఆ రాష్ట్ర వాసుల‌కు ఎంతో గొప్ప విష‌య‌మే. మంగ‌ళ‌వారం రోజు గాలి నాణ్య‌త  347 AQI గా ఉంది. అది బుధ‌వారం ఉద‌యం నాటికి 286 AQIకి చేరుకుంది. 

గాలి కాలుష్యం జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన అంశాల‌ను ప్ర‌భుత్వం నివారిస్తుండ‌టంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మెరుగుప‌డుతోంది. బుధ‌వారం ఉద‌యం రోజు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్ర‌కారం.. ఢిల్లీ యూనివర్సిటీ, పుసా (PUSA), లోధి రోడ్, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (టెర్మినల్ 3) సహా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు 286, 297, 290 AQIతో ‘పూర్’ జాబితాలో ఎయిర్ క్వాలిటీని న‌మోదు చేశాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో అంటే  IIT-ఢిల్లీ, మధుర రోడ్‌లు ఒక్కొక్కటి 303 AQIతో ‘వెరీ పూర్’ విభాగంలో ఎయిర్ క్వాలిటీని నమోదు చేశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios