Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం.. తగ్గిన వాయు కాలుష్యం..

ఢిల్లీలో గాలి నాణ్యత కొంచెం మెరుగుపడింది. ఇది ఢిల్లీ వాసులకు కాస్త ఊరటనిచ్చే అంశం. బుధవారం ఉదయం SAFAR విడుదల చేసిన అంచనాల ప్రకారం ఢిల్లీ గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీ నుంచి ‘పూర్’ కేటగిరీకి వచ్చింది

Some relief for Delhiites .. Reduced air pollution ..
Author
Delhi, First Published Dec 29, 2021, 11:58 AM IST

ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్తా తగ్గింది. దీంతో ఢిల్లీ వాసులకు కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్ల‌య్యింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) బుధ‌వారం విడుద‌ల చేసిన  తాజా అంచ‌నాల ప్ర‌కారం.. గాలి నాణ్య‌త 347 AQI నుంచి 286 AQIకి వ‌చ్చింది. అంటే ఢిల్లీలో ఇంకా పూర్తిగా గాలినాణ్య‌త మెరుప‌గ‌ప‌డలేదు. కానీ ‘‘ వెరీ పూర్’’ కేటగిరి నుంచి ‘‘పూర్’’ కేటగిరికి మారింది. ఇది ఆ రాష్ట్ర వాసుల‌కు ఎంతో గొప్ప విష‌య‌మే. మంగ‌ళ‌వారం రోజు గాలి నాణ్య‌త  347 AQI గా ఉంది. అది బుధ‌వారం ఉద‌యం నాటికి 286 AQIకి చేరుకుంది. 

ట్రిపుల్ తలాక్‌తో ఒంటరైన మహిళతో మోదీ ఆసక్తి కర సంభాషణ.. ఆమెలో ధైర్యం నింపడమే కాకుండా కోరిన వెంటనే..

గాలి కాలుష్యం జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన అంశాల‌ను ప్ర‌భుత్వం నివారిస్తుండ‌టంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మెరుగుప‌డుతోంది. బుధ‌వారం ఉద‌యం రోజు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్ర‌కారం.. ఢిల్లీ యూనివర్సిటీ, పుసా (PUSA), లోధి రోడ్, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (టెర్మినల్ 3) సహా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలు 286, 297, 290 AQIతో ‘పూర్’ జాబితాలో ఎయిర్ క్వాలిటీని న‌మోదు చేశాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో అంటే  IIT-ఢిల్లీ, మధుర రోడ్‌లు ఒక్కొక్కటి 303 AQIతో ‘వెరీ పూర్’ విభాగంలో ఎయిర్ క్వాలిటీని నమోదు చేశాయి. 

కేట‌గిరిల‌ను  ఎలా నిర్ణ‌యిస్తారు..? 
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) గాలి నాణ్య‌త విభాగాల‌ను, కేట‌గిరీల‌ను నిర్ణ‌యిస్తుంది. దాని ప్రకారం ఎయిర్ క్వాలిటీ 51 నుంచి 100 AQI గా న‌మోదైన ‘సంతృప్తికరమైనది’ లేదా  ‘వెరీ గుడ్’గా పరిగణిస్తుంది. 101-200 AQI గా నమోదైతే ‘మధ్యస్తమైనది’గా పరిగణిస్తుంది. అలాగే 201-300 AQI గా నమోదైతే ‘పూర్’ కిందకు వస్తుంది. అలాగే 300-400 AQI గా నమోదైతే ‘వెరీ పూర్’గా పరిగణిస్తుంది. అయితే 401-500 మధ్యన నమోదైతే మాత్రం ‘డేంజరస్’ కేటగిరి కిందకు వస్తుంది. 

భారత్‌లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

ఎన్‌సీఆర్‌లో కూడా..
జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో కూడా గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. అయితే గురుగ్రామ్, నోయిడా కూడా బుధవారం ఉదయం AQI వరుసగా 297, 303 తాకడంతో ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీల ఎయిర్ క్వాలిటీల‌ను నమోదు చేసింది. గ‌త కొన్నేళ్ల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దేశ రాజ‌ధాని అన్ని రాష్ట్రాల కంటే విస్తీర్ణంలో త‌క్కువ‌గా ఉండ‌టం, ప‌క్క‌నే పంజాబ్, హ‌ర్యానా రాష్ట్రాల రైతుల చ‌ర్య‌ల వ‌ల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ప్ర‌తీ ఏటా రెండు రాష్ట్రాల రైతుల తమ పంట వ్య‌ర్థాల‌ను త‌గుల‌బెట్ట‌డం వల్ల ఆ పొగ‌మొత్తం ఢిల్లీని ముంచెత్తుతోంది. దీనికి తోడు అక్క‌డ ఉండే ప‌రిశ్ర‌మ‌ల పొగ కూడా వాయు కాలుష్యానికి కార‌ణం అవుతోంది. ప్ర‌తీ ఏటా ఈ వాయు కాలుష్యం వ‌ల్ల ఎంద‌రో చ‌నిపోతున్నారు. ప్ర‌తీ ఏటా కొన్ని రోజుల పాటు స్కూళ్ల‌కు సెలవులు ప్ర‌క‌టిస్తున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఇప్పుడు ఢిల్లీలో గాలి కాలుష్యం తగ్గిపోతోంది. గాలి నాణ్య‌త మెరుగుప‌డుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios