కోవిడ్ ఎక్కడా లేదు.. బీజేపీ భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది - మల్లికార్జున్ ఖర్గే
భారత్ జోడో యాత్రను ఆపేందుకే కేంద్ర ప్రభుత్వం కరోనా భయాన్ని రేకెత్తిస్తోందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కోవిడ్ ఎక్కడా లేదని తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కరోనా మహమ్మారిపై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు కోవిడ్ ఎక్కడా లేదని అన్నారు. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్రను చూసి కాషాయ పార్టీ భయపడుతోందని, దానిని ఆపేందుకే కోవిడ్ ను ఒక సాకుగా చెబుతోందని అన్నారు.
పదేళ్లుగా ఆధార్‌ను అప్‌డేట్ చేయలేదా?.. అయితే తప్పనిసరిగా ఆ పని చేయాల్సిందే: యూఐడీఏఐ
‘భారత్ జోడో యాత్ర వల్ల బీజేపీ భయపడిపోయి కోవిడ్‌ని సాకుగా చూపుతోంది. ఎక్కడా కోవిడ్ లేదు. ఎవరికీ ఏమీ జరగలేదు. ప్రధాని మోడీయే మాస్క్ వేసుకోరు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, యాత్రను విచ్ఛిన్నం చేసేందుకే ఇదంతా చేస్తున్నారు.’’ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మూడు రోజుల కిందట ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్ జోడో యాత్రను ఆపడానికి కోవిడ్ ను కేంద్రం ఒక సాకుగా చూపుతోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా తాము చేపడుతున్న పాదయాత్ర మద్దతు పెరుగుతోందని, దానిని చూసి అధికార పార్టీ అలెర్ట్ అయ్యిందని ఆరోపించారు. అందుకే దానిని ఆపేందుకు కోవిడ్ -19 హెచ్చకలను ఉపయోగిస్తోందని తెలిపారు. “ ఇది వారి (బీజేపీ) కొత్త ఆలోచన. కోవిడ్ వస్తోంది.. యాత్రను ఆపండి అని వారు (కేంద్రం) నాకు లేఖ రాశారు. ఈ యాత్రను ఆపడానికే ఇవన్నీ సాకులు. వారు భారతదేశ సత్యానికి భయపడుతున్నారు” అని రాహుల్ గాంధీ అన్నారు.
మాతృభాషలో చదివితేనే విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుంది - కేంద్ర హోం మంత్రి అమిత్ షా
“భారత్ జోడో యాత్ర 100 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇందులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పురుషులు, మహిళలు, పిల్లలతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. కానీ వారి మతం ఏమిటని ఎవరూ ఎవరినీ అడగలేదు. ఏ భాష మాట్లాడుతారు ? ఏ ప్రాంతం నుంచి వచ్చారు వంటి వివరాలు కూడా అడగలేదు. ఈ యాత్రలో 24 గంటల పాటు ప్రజలు ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్రేమను పంచుకున్నారు.” అన్నారాయన. అధికార పార్టీ (బీజేపీ) దేశంలో ఎన్నైనా బహిరంగ సభలు నిర్వహిస్తుందని, కానీ భారత్ జోడో యాత్ర జరుగుతున్న చోట మాత్రమే కోవిడ్ ను చూస్తోందని తెలిపారు. ఈ యాత్రను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం సాకులు చెబుతూ ముందుకు వస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్ర ముందుకు సాగకుండా ఏదీ అడ్డుకోజాలదని, కోవిడ్ మహమ్మారి ముసుగులో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు.
వాజ్‌పేయి జయంతి: సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..
గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌లకు లేఖ రాశారు. కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించాలని లేదా మార్చ్‌ను రద్దు చేయాలని వారిని కోరారు. ఈ లేఖ రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో ఆరోగ్య మంత్రి స్పందించారు. ఇది రాజకీయం కాదని స్పష్టం చేశారు. “ఇది అస్సలు రాజకీయం కాదు. నేను ఆరోగ్య మంత్రిని. ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. కోవిడ్ -19 నియమాలను పాటించాలని చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది ’’ అని ఆయన తెలిపారు.