భర్త నుంచి నెలకు రూ. 50 వేల చొప్పున మెయింటెనెన్స్ కావాలని భార్య కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ భర్త నుంచి భరణం పొందే భార్య హక్కు అబ్జల్యూట్ కాదని వివరించింది. కచ్చితంగా భర్త ఇవ్వాలనేమీ లేదని తెలిపింది. భార్య ఉన్నత చదువులు చదివారని, సంపాదించే సామర్థ్యం ఉన్నదనీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆ పిటిషన్ తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: గృహ హింస చట్టం కింద తనకు ఆర్థికంగా భర్త నుంచి సహాయం కావాలని భార్య ఓ అప్లికేషన్ దాఖలు చేయగా.. ఆ దరఖాస్తును ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆమె ఉన్నత చదువులు చదివిందని, సొంతంగా ఆర్థిక వనరులను సంపాదించుకునే సామర్థ్యం ఆమెకు ఉన్నదని వివరించింది. అలాంటి మహిళకు భర్త నుంచి మెయింటెనెన్స్ ఇప్పిస్తే అది ఆమె ఖాళీగా ఉండటానికి, భర్తపైనే ఆధారపడే అలవాటును ప్రోత్సహించినట్టు అవుతుందని తెలిపింది. కాబట్టి, ఆమెకు భరణం చెల్లించాలని తాను ఆదేశించడం లేదని వివరించింది. నెలకు రూ. 50 వేల మెయింటెనెన్స్ ఇవ్వాలని భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ స్వయం సిద్ధ త్రిపాఠి విచారించి పై తీర్పు వెలువరించారు.
భర్త నుంచి భార్య భరణం పొందడం కచ్చితమేమీ కాదని కోర్టు పేర్కొంది. భర్త నుంచి వేరుగా నివసిస్తున్న ఆ భార్య సొంతంగా జీవించలేని స్థితిని, కనీస అవసరాలను కూడా అందిపుచ్చుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు భరణం గురించి మాట్లాడాలని తెలిపింది. అదే విధంగా భర్త ఆమెను వదిలించుకుని విలాసవంతంగా జీవిస్తున్నారనీ వారు నిరూపిస్తే భరణానికి ఆదేశించవచ్చు అని వివరించింది.
Also Read: మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన సంచలన వీడియో వైరల్.. నిమిషాల్లో ప్రాణాలు నిలిపాడు
భర్తతో కలిసి జీవించినప్పటి జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు తన పరిస్థితులు బాగోలేవి దరఖాస్తుదారు నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత కేసులో భార్య ఎంబీఏ గ్రాడ్యుయేట్, భర్తకు సమాంతరంగా పెద్ద చదు వులు చదివింది. జాబ్ చేయడానికి అన్ని విధాల ఆమెకు అనుకూలతలు ఉన్నాయి. భర్త క్వాలిఫైడ్ డాక్టర్. కానీ, ప్రస్తుతం నిరుద్యోగే. ఆయన విలాసవంతమైన జీవితం గడపడం లేదు.
ఈ నేపథ్యంలోనే కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. భార్య, భర్త ఇరువురూ సంపాదించే సామర్థ్యం కలిగి ఉన్నారని, కానీ నిరుద్యోగులు అని వివరించింది. కాబట్టి, ఒక నిరుద్యోగిని.. మర నిరుద్యోగికి నెల వారీగా డబ్బులు చెల్లించాలని ఆదేశించడం సరికాదని తెలిపింది.
