Asianet News TeluguAsianet News Telugu

మంచులో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన సంచలన వీడియో వైరల్.. నిమిషాల్లో ప్రాణాలు నిలిపాడు

మంచులో కూరుకుపోయిన ఓ వ్యక్తిని అటు వైపుగా వెళ్లిన మరో వ్యక్తి కాపాడిన విధాన్ని ఆయన తలకున్న క్యామెరా క్యాప్చర్ చేసింది. క్షణాల్లోనే మనిషి ప్రాణాలను కాపాడిన ఆ వ్యక్తిని రియల్ హీరో అని నెటిజన్లు పొగుడుతున్నారు.
 

man buried by snow rescued by a skier, terrifying video viral kms
Author
First Published Apr 5, 2023, 5:14 AM IST

న్యూఢిల్లీ: అడుగుల్లోతు మంచులో కూరుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడిన నాటకీయ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఫుల్ వైరల్ అయింది. వాషింగ్టన్ నార్త్ వెస్ట్‌‌లోని మౌంట్ బేకర్ స్కీ ఏరియా గుండా ఆ వ్యక్తి రైడింగ్ చేస్తూ కిందికి వెళ్లుతున్నప్పుడు స్నోబోర్డ్ మంచులో నుంచి బయటకు కనిపించింది. ఆ స్నోబోర్డ్ ఉపయోగించిన వ్యక్తి బహుశా ఆ మంచులో కూరుకుపోయి ఉంటాడని ఊహించాడు. వెంటనే అక్కడ మంచు తవ్వి పోశాడు. కొన ఊపిరితో కొట్టమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలను నిమిషాల్లోనే కాపాడాడు. ఈ సహాయక చర్య చేపట్టిన వ్యక్తి తలకు బిగించిన క్యామెరా ఈ నాటకీయ విజువల్స్‌ క్యాప్చర్ చేసింది.

ఫ్రాన్సిస్ జుబేర్ అనే వ్యక్తి స్నోబోర్డ్ పై వేగంగా వెళ్లుతున్నాడు. ఇంతలో ఓ చెట్టు వద్ద ఆయనకు మంచులో నుంచి బయటకు కనిపించిన ఓ స్నోబోర్డ్ కనిపించింది. వెంటనే అక్కడ అనుమానంతో ఆగాడు. ఆ చెట్టు పక్కనే మంచులో ఒకరు కూరుకుపోయి ఉంటాడని అనుమానించాడు. కేక వేశాడు. కానీ, ఏ సమాధానం రాలేదు. అంతే వేగంగా చేతులతోనే మంచు పక్కకు తవ్వి తీశాడు. ఇలా తీస్తుండగా ఓ వ్యక్తి చేతులు కనిపించాయి. 

Also Read: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా ఎజెండా: జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్.. పొత్తులపై వ్యాఖ్య

ఎలా ఉన్నావు? శ్వాస తీసుకుంటున్నవా? అని మళ్లీ కేకలు పెట్టాడు. కానీ, అటు వైపు నుంచి ఏ సమాధానం రాలేదు. మళ్లి కొంత తవ్వి.. ఆ వ్యక్తి ముఖం వరకు మంచు తవ్వేశాడు. ముఖం నుంచి ముఖ్యంగా నోటి నుంచి మంచును తొలగించి ఆ వ్యక్తి శ్వాసించడానికి మార్గం సుగమం చేశాడు.

ఆ వెంటనే తన బ్యాగ్‌లో నుంచి మంచును తోడే షాల్ తీశాడు. వేగంగా మంచును తొలగించాడు. అప్పుడు ఆ వ్యక్తి అందులో నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. బాధితుడిని ఇయాన్ స్టేజర్‌గా గుర్తించారు. కాపాడిన వ్యక్తి ఫ్రాన్సిస్ జుబేర్‌ను రియల్ హీరోగా నెటిజన్లు కొలిచారు. చాలా మంది జుబేర్‌ను ప్రశంసించారు.

Follow Us:
Download App:
  • android
  • ios