నోయిడాలో ఇద్దరు దంపతులు ఏడో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేవని పోలీసులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: నోయిడాలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. దాదాపు 40 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు దంపతులు పాడుబడిన బిల్డింగ్‌లో ఏడు అంతస్తుల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేవని పోలీసులు చెప్పారు.
నోయిడా సెక్టార్ 59లోని ఓ బిల్డింగ్‌కు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వాచ్‌మెన్‌గా చేసేవాడు. ఆ బిల్డింగ్ సమీపంలోనే ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ఎనిమిదేళ్లుగా నివసిస్తున్నాడని అధికారులు వివరించారు. ‘తమకు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. ఓ వాచ్‌మెన్, ఆయన భార్య ఇద్దరూ ఓ బిల్డింగ్‌లో ఏడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. వారిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆ ఇద్దరూ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు’ అని సెక్టార్ 58 పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు తెలిపారు.
ఆ దంపతులు ఈశాన్య ఢిల్లీలోని చాంద్ బాగ్ ఏరియాకు చెందినవారు. వారి పిల్లలు అక్కడే బంధువులతో కలిసి ఉంటున్నారు. నోయిడాలో పిల్లలు ఉండరు. నోయిడాలో ఆ దంపతులు మాత్రమే నివసిస్తున్నారు.
Also Read: MP Rahul Gandhi: 24 గంటల్లో ఎంపీగా రద్దు చేశారు.. పునరుద్ధరించడానికి ఎంత సమయం?: కాంగ్రెస్
వారి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కూడా తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు.
