దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఆకాశంలో కనివిందు చేసింది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల వాసులు దీనిని వీక్షించారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఈ అద్భుతాన్ని చూడలేకపోయారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ‘‘మిగిలిన భారతీయుల్లాగే తాను కూడా సూర్యగ్రహణాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డానని, కానీ దురృష్టవశాత్తూ ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల దానిని చూడలేకపోయానన్నారు.

Also Read:పూర్ణ సూర్యగ్రహణం: ఆ ఒక్క ఆలయమే తెరిచారు

అయితే కోజికోడ్, ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నానని.. ఖగోళ నిపుణులతో మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఈ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నానని మోడీ ట్వీట్ చేశారు.

మరోవైపు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిచూపారు. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన చిన్నారులు, విద్యార్థులు గ్రహణాన్ని ఆసక్తిగా తిలకించారు. సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సంప్రోక్షణ చర్యలు చేపట్టారు. 

దేశంలోని అన్ని దేవాలయాలను గ్రహణం సమయంలో మూసివేస్తారు. కానీ, చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి ఆలయం మాత్రం మూసివేయరు. గ్రహణ సమయంలో ఈ ఆలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. 

Also Read:Astrology 2020: కొత్త ఏడాదిలో రాశులవారీగా మీ వృత్తి, ఉద్యోగాలు ఇలా

సూర్య చంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 9గ్రహరాశులున్న కవచంతో ఈ ఆలయం నిర్మితమైనది. ఈ కవచాన్ని ఆలయంలో శివలింగంపైన ఏర్పాటు చేశారు. ఇందు వలన సౌరవ్యవస్థ అంతా అక్కడే ఉంటుందని చెబుతారు.

ఈ సౌరవ్యవస్థ శక్తితో రాహువు, కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఆలయంలో గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు.