న్యూఢిల్లీ: దశాబ్దాల తర్వాత గురువారం నాడు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. గురువారం నాడు ఉదయం 8 గంటల 8 నిమిషాల నుండి ఉదయం 11 గంటల నుండి 11 నిమిషాల వరకు ముగియనుంది. 

సూర్యగ్రహణం కారణంగా దేశంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. ఏపీ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచారు.  ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం.

మూడు గంటలకు పైగా సూర్యగ్రహణం  ఉంటుంది.  ఇండియాతో పాటు అస్ట్రేలియా, పిలిప్ఫిన్స్, సౌదీ అరేబియా, సింగపూర్ దేశాల్లో సూర్యగ్రహణం కన్పిస్తోంది. సంపూర్ణ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్‌గా సూర్యగ్రహణం కన్పిస్తోంది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, పిళికుల్ల, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదికాలంలో ఇది మూడో సూర్యగ్రహణం.

సూర్యగ్రహణం సందర్భంగా బుధవారం నాడు రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. 13 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయతలుపులు తెరుచుకొంటాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచి ఉంచారు. ఈ ఆలయానికి సూర్యగ్ర

ఇలా రాహు, కేతులు సూర్యచంద్రుల్ని మింగే సమయంలో రాహు కేతుల శక్తి ప్రభావం వలన దేవతల శక్తి సన్నగిల్లుతుందని అంటుంటారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవతా మూర్తుల శక్తి క్షీణించకూడదనే ఆలయాన్ని మూసేస్తారని పండితులు చెబుతారు.

దేశంలోని అన్ని దేవాలయాలను గ్రహణం సమయంలో మూసివేస్తారు. కానీ, చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి ఆలయం మాత్రం మూసివేయరు. గ్రహణ సమయంలో ఈ ఆలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తారు. 

 సూర్య చంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 9గ్రహరాశులున్న కవచంతో ఈ ఆలయం నిర్మితమైనది. ఈ కవచాన్ని ఆలయంలో శివలింగంపైన ఏర్పాటు చేశారు. ఇందు వలన సౌరవ్యవస్థ అంతా అక్కడే ఉంటుందని చెబుతారు. ఈ సౌరవ్యవస్థ శక్తితో రాహువు, కేతువులు ఈ ఆలయంలోనికి ప్రవేశించలేవని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఆలయంలో గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. 


సూర్యగ్రహణం సమయంలో  చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కన్పిస్తాయి. హైద్రాబాద్‌లో ముప్పావు వంతు మాత్రమే సూర్యగ్రహణం కన్పించింది.  కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీ, మహారాష్ట్ర,కేరళలలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సూర్యగ్రహణం కన్పించింది.