Astrology 2020: కొత్త ఏడాదిలో రాశులవారీగా మీ వృత్తి, ఉద్యోగాలు ఇలా...

First Published 25, Dec 2019, 1:28 PM

2019 సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో 2019 ముగిసి 2020సమ్వత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏషియా నెట్ న్యూస్ అన్ని రాశులవారికి 2020 ఆర్ధిక, వృత్తి, ప్రేమ వ్యవహారాల్లో ఎలా ఉండబోతుందో మీకు ఈ సంవత్సరాంతం వరకు అందించనున్నాం. ఈ సిరీస్ లో భాగంగా...  ఒక్కో రాశి వారికి 2020లో వృత్తి పరంగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. 

మేష రాశి: వృత్తిపరమైన జీవితములో వృద్ధి నిలకడగా ఉంటుంది.మీరు వేరే ఉద్యోగము మారాలి అనుకుంటే, మీరు విజయవంతముగా మారుతారు. నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాలు లభిస్తాయి.అయినప్పటికీ, మీరు సంవత్సర ప్రారంభములో కొంతకష్టపడవలసి ఉంటుంది. ఆ తరువాత , నెమ్మదిగా అంతా కుదురుకుంటుంది. మీరు పనిచేసే చోట జనవరి మధ్యనుండి మే మాసం మధ్యవరకు కార్యాలయాల్లో వృద్ధి నిలకడగా ఉంటుంది.తద్వారా మీ వృత్తిపరమైన జీవితము చాలా బాగుంటుంది.మనపై మనకు నమ్మకము ఉండటం చాలా అవసరము.కానీ , అది అతిగా ఉండుటద్వారా మనజీవితములో ఓటమికి కారణమవుతుందని మీరు గ్రహించాలి. మీ సామర్ధ్యాన్ని మీరు నమ్మండి, ప్రారంభించిన ఏ పనిని కూడా వదిలేయకండి.ఇంతకుముందు మీరు చేసినకష్టానికి సంబంధించి దానియొక్క ప్రతిఫలమును మీరు అందుకుంటారు. జనవరి నెలలో వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలను తీసుకొనవద్దు.మీరు ఒకవేళ కష్టపడి పనిచేసేవారైతే మీరు మీ ఉన్నతాధికారుల మన్ననలతో పాటు ప్రమోషన్లు పొందేఅవకాశము ఉన్నది. మీ ప్రయత్నాలు  వృధాఅవవ్వు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.ఎమ్మెన్సీల్లో పనిచేస్తున్నవారికి మంచిఫలితాలు అందుతాయి.  శుభం భూయాత్.

వృషభ రాశి: వృత్తి జీవితంలో 2020 సంవత్సరం కీలకం. శనిగ్రహం జనవరిలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తుంది. ఇది కష్టపడి పనిచేసేవారికి విజయానికి ద్వారం తెరుస్తుంది. మీరు క్రొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ మార్పు మీకు కలిసివస్తుంది.  నిరుద్యోగులు మంచి ఉద్యోగం చేయాలనుకుంటే శ్రమించాల్సి ఉంటుంది. మార్చి నుండి జూన్ వరకు ఉన్న సమయం ఒకింత పరీక్షా కాలం. మీరు మీ లక్ష్యాలను సాధించాలనుకుంటే అచంచలమైన నిబద్ధతతో ధైర్యంగా ప్రయత్నాలు చేయాలి. కలలు కనడం చాలా సులభం కాని మీ కలలను సాకారం చేసుకోవడానికి, సమయం, కృషి అవసరం. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహనంతో వేచి చూడాలి. జూన్  ప్రారంభం కాగానే మీకు కావలసిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. కార్పొరేట్ రంగంలో మీ పోటీదారుల కంటే పైకి ఎదగడానికి సహాయపడే నూతన విషయాలను నేర్చుకుంటారు. మీవృత్తిపరమైన జీవితములో గొప్ప వృద్ధిని మీరు చూస్తారు. మీ సీనియర్‌లను ఇబ్బందిపెట్టే ఏ విధమైన పనులు కూడా చేయవద్దు. ఆలా చేస్తే అది మీ వృత్తి‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. చట్టాన్ని మీరు ప్రవర్తించకండి, లేకపోతే మీరు చట్టపరమైన సమస్యలలో చిక్కుకోవచ్చు. పరువునష్టం అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల, మీపేరుప్రఖ్యాతలను నాశనం చేసే అటువంటి పనుల జోలికి మాత్రం వెళ్లకుండా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా  అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ అంతిమ విజయం మీదే! సెప్టెంబర్ తరువాత సమయం మీకు మరింత అనుకూలం. దాన్ని పూర్తిగా సద్వినియోగించుకుంటారు కూడా.  శుభం భూయాత్.

మిథున రాశి: వృత్తిపరమైన జీవితములో ఈసంవత్సరము ఎదుగుదలను చూస్తారు. మీరు కష్టపడి పనిచేస్తారు. 8వఇంట శని సంచారము వల్ల మీరు వ్యాపారములో కొన్నిఇబ్బందులను ఎదురుకొనక తప్పదు.ఇది కొందరికి మాత్రమే! వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ మీరు నష్టపోకుండా జాగ్రత్తపడతారు. ఉద్యోగులకు వారి కష్టానికి తగిన ఫలితము కలగటంలేదుఅని చిన్న బాధ మాత్రం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాలను అందిస్తాయి.మీకు, మీభగాస్వమికి మధ్య జరిగే కొన్నిఘర్షణలవల్ల కొంత ఆందోళనలకు గురిఅవుతారు.మీరు వీటిని సాధ్యమైనంతగా పరిష్కరించుకోవాడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రారంభించిన కొన్నిపనులు మీ పేరుకు భంగం వాటిల్లే ప్రమాదాన్ని కొని తెచ్చపెట్టవచ్చు. నష్టాలువచ్చే ప్రమాదం కూడా ఉంది. కావున, అలంటి కార్యక్రమాలను మీరు ఆపివేయటం లేదా మార్చటం చెప్పదగిన సూచన. మీ ఆత్మసాక్షే మీకు హితబోధ చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. అటువంటి సమస్యలు ఏమైనాఉంటే ఇప్పుడే పరిష్కరించుకోవటం చెప్పదగిన సూచన.మీ బలహీనతలను బలముగా మార్చుకుంటే మీరు మీ వృత్తిపరమైన జీవితములో విజయాలను అందుకోవచ్చు.   శుభం భూయాత్.

కర్కాటక రాశి : ఈ సంవత్సర ప్రారంభం నుండి సానుకూలంగా సాగుతుంది.మీ వృత్తిపరమైన జీవితముకూడా బాగుంటుంది.ఎవరైతే ఉద్యోగము మారాలనుకుంటున్నారో వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చు. కొత్త ఉద్యోగములో మీరు మంచిజీతాన్ని ఉన్నత హోదాను అందుకుంటారు. మీ ప్రాధమికఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కనుక జాబ్ కి కొత్తవారు అయితే, మంచి సంస్థలను ఎన్నుకుని చేరటం మంచిది.మీ కలలను సాకారం చేసుకోవడానికి   మీరు కొంత శ్రమించవలసి ఉంటుంది.మీరు శ్రమిస్తారు కూడా. మీ ఆత్మవిశ్వాసమే మీకు బలం. దీనికి మీరు మరింత సహనము, కష్టపడి పనిచేసేతత్వమును అలవరుచుకుంటారు. గురు అదృష్ట సంచారమువల్ల వృత్తిపరమైన జీవితములో నిలకడగా రాణిస్తారు. అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి అవకాశాలు మెండుగా వస్తాయి. ఇక స్నేహితులతో కలసి భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికైనా, చేసేవారికయినా అదృష్టకాలమని చెప్పవచ్చు. వ్యాపారములో అద్భుతమైన లాభాలను అందుకుంటారు. ఇక విదేశీ ఆఫర్స్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే...గెట్ రెడీ ప్యాక్ యువర్ బ్యాగ్స్. ప్రయాణాలు మీకు మంచిఫలితాలు అందిస్తాయి. విదేశీ ప్రయాణములు వృత్తిపరమైన అభివృదికి తోడ్పడతాయి.ప్రమోషన్లతో కూడిన స్దానచలనానికి అవకాశాలు అందివస్తాయి.  శుభం భూయాత్.

సింహ రాశి : వృత్తికి సంబంధించి ఎదుగుదలకు మంచి అవకాశం ఉంది. ఈ సంవత్సరం, మీరు మీ పనిపై ఎక్కువగా దృష్టి పెడతారు. మెరుగైన పనితీరును కనబరుస్తారు. మీ అద్భుతమైన శక్తిసామర్థ్యాలు వల్ల మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సఫలీకృతులవుతారు. సంవత్సర ప్రారంభంలో,శని జనవరి 24 న మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశించి, ఏడాది పొడవునా అదే స్థితిలో ఉంటాడు. ఫలితంగా, పనిలో ప్రమోషన్ పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. ఇక బదిలీలు కూడా మీకు అనుకూలం. కోరుకున్న విధంగా ఉద్యోగ బదిలీ పొందే అవకాశం ఉంది. మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వృత్తి జీవితంలో చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. కాకపోతే అవి కేవలం తాత్కాలికం మాత్రమే. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. మంచి జాబ్ కోసం వెతుకుతున్న వారికి కావలసిన ఉద్యోగం లభిస్తుంది. మీ ధైర్యం, శక్తి కి అచంచల ఆత్మవిశ్వాసం  తోడవుతుంది. సంవత్సరం అంతా చురుకుగా ఉంటారు, ఈ సంతోష జీవనవిధానం జీవితంలోని అనేక అంశాలలో విజయానికి దారి తీస్తుంది. మీరు మీ పనిభారాన్ని బాగా బ్యాలన్స్ చేయగలుగుతారు. కష్టపడి పనిచేస్తారు. ఈ సంవత్సరం మీ కార్యాలయంలో మీ అర్హతలు,  నైపుణ్యాలకు పరీక్షాకాలం. మీ సీనియర్లతో ఎలాంటి వాదనకు దిగకుండా ఉండండి. జూలై నుండి డిసెంబర్ వరకు ఉన్న కాలం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార రంగానికి సంబంధించిన వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. క్రొత్త ప్రాజెక్ట్ లేదా పనిని ప్రారంభించే ముందు, ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం, మీరు మంచి డబ్బు సంపాదించడమే కాకుండా, మీ వృత్తి‌లో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మొత్తంమీద, ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు.   శుభం భూయాత్.

కన్యా రాశి : వృద్ధి, విజయము,అవకాశాలను మీరు మీ మనసు, తెలివితేటల ద్వారా సాధిస్తారు. మీ హార్డ్ వర్క్ కి స్మార్ట్ వర్క్ కూడా తోడవుతుంది. 2020లోమీ వృత్తిపరమైన జీవితములో ఎదుగుదల సిద్ధిస్తుంది. స్థానచలనం కనబడుతుంది. మీ పదవి లేదా పనిచేసే చోటుని మీరు మార్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో స్థానచలనము లేదా వ్యాపారాల్లో ప్రయాణాలు తప్పానిసరిగా ఉంటాయి. సంవత్సర ప్రారంభము నుండి మీకు అనుకూలముగా ఉంటుంది.  ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు.నూటికి నూరుశాతము మీ పనికి మీరు న్యాయము చేస్తారు.మీరు ఒకవేళ ఎమ్మెన్సీల్లో పనిచేస్తున్నవారు అయితే, మీ పనిని మీ ఉన్నతాధికారులు గుర్తిస్తారు.మీ కెరీర్ ఎదుగుదల గణనీయముగా ఉంటుంది. వృత్తిపరమైన జీవితంలో మీరు ఈసంవత్సరము నెమ్మదిగా, నిలకడగా ఎదుగుతారు.ఈసంవత్సరము మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగము మారాలి అనుకుంటే, మీకుఅనుకూల కాలంగా చెప్పవచ్చు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్ధికలాభాలు సామాన్యంగా ఉన్నప్పటికీ మీకు కావలిసినంత డబ్బు చేతిలో ఆడుతుంది. మీ ఆశయాలన్నిటిని మీరు నెరవేర్చుకోగల్గుతారు. శుభం భూయాత్.

తులా రాశి: ఈసంవత్సరము గొప్పవిజయాలను అందుకుంటారు.శని 4వఇంట సంచరిస్తాడు,6వఇంటిని,10వఇంటిని తన దృష్టితో ప్రభావితము చేస్తున్నాడు. మీ ఆశయాలను నెరవేర్చుకోడానికి మరింతగా కష్టపడవలసి ఉంటుంది. ఏప్రిల్, మే , జూన్ , జులై నెలల్లో గురుడు 4వఇంట సంచరిస్తాడు.తద్వారా మీరు నిర్ణయాలను తీసుకునే విషయంలో మరింత తెలివిగా వ్యవహరిస్తారు, తద్వారా గౌరవమర్యాదలు పొందుతారు. డిసెంబర్ నెలలో,మీరు ప్రమోషన్లు పొందగలరు.మీరు ఒకవేళ ఉద్యోగమార్పు, స్థానచలనం, కోరుకుంటే జనవరి,ఫిబ్రవరి , మర్చి,ఏప్రిల్, నవంబర్ నెలలో ప్రయత్నించండి. మీరువాటిని ఖచ్చితంగా పొందుతారు. మీ వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థితిని అందుకోగల్గుతారు.  కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఫలితాలను ఒకింత ఆలస్యము చేస్తాడు శని. చికాకు తెచ్చుకోకుండా, మంచిపనులను చేస్తూనే ఉండండి. పరీక్ష కాలం మిమ్మల్ని మరింత దృఢపరుస్తాయి.అదుష్టము తప్పక కలసివస్తుంది.ఈ సంవత్సరము కొత్తవ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం శ్రేయస్కరం. విజయాలను సాధించటానికి కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తితే అనుభవము ఉన్నవారిని సంప్రదించి నిర్ణయము తీసుకోవడం చెప్పదగిన సూచన. ఎప్పటినుండో వ్యాపారాలు చేస్తున్నవారు ఆందోళన చెందవలసిన అవసరంలేదు.మీ వ్యాపారము వృద్ధిచెందుతుంది  ఆందోళనలు దరిచేరనీయకండి.సంవత్సరము మధ్యలో స్థానచలనము లేదా నూతన ఉద్యోగ సూచనలు ఉన్నాయి.  ఉద్యోగమైనా వ్యాపారమైనా కష్టే ఫలి!  శుభం భూయాత్.

వృశ్చిక రాశి : వృత్తిపరంగా చాలా అద్భుతముగా ఉంటుంది.సంవత్సర ప్రారంభములో, కొత్తపనులను ప్రారంభిస్తారు. చేస్తున్నపనుల్లో విజయాలను అంధుకుంటారు. జీవితమంలో ఆనందాన్ని పొందుతారు.మిలో మీరు అంతర్లీనంగా దాగిఉన్న నూతన శక్తిని కనుగొంటారు. వృత్తి ఉద్యోగాల్లో దూసుకుపోతారు. అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే కుంగిపోవద్దు. ట్రాన్స్ఫర్ గనుక ఎదురైతే చింతించకండి. అది మీ జీవితంలో నూతన అధ్యయనానికి తెర తీస్తుంది. వృత్తిలో ఈ సమ్వత్సరమంతా అద్భుతమైన అవకాశాలను పొందుతారు. తద్వారా వృత్తిలో ఉన్నతశిఖరాలకు చేరుకుంటారు.మీ ప్రయత్నాల్లో ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు రాకుండా చూసుకుని విజయాలను అందుకుంటారు. గట్టిగ ప్రయత్నిస్తే ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈసంవత్సరము ఉద్యోగముమారే అవకాశము కూడా ఉన్నది. ఫలితముగా మీ ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంది.స్దానచలానాలు సంభవించే అవకాశము ఉన్నది. ఈ 2020లో మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది మీ వృత్తుల్లో విజయాలను అందుకుంటారు.వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, కానీ, మీ తెలివితేటలతోవాటిని సులభముగా అధిగమించగలరు. అయినప్పటికీ ఒకింత జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరము మరింత సంతోషంగా ఉంటారు. ఏదైనా స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే,ఇది మంచి సమయముగా చెప్పవచ్చు.  శుభం భూయాత్.

ధనస్సు రాశి :ఈ సంవత్సరం వృత్తికి, వృత్తి జీవితానికి కూడా చాలా అనుకూల కాలం. అదనపు సంపాదన కోసం నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనుకుంటే ముందుకు సాగవచ్చు. అంతేకాక, మీరు విదేశీ వ్యాపార సంస్థల నుండి కూడా లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం విషయంలో మాత్రం ఒకింత జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులు సీనియర్ల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఎక్కువ గౌరవం కూడా పొందుతారు. మీరు చాలా కాలంగా ఆలస్యం చేస్తున్న కొన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తారు. మీ స్వప్నాన్ని చేరుకోవడానికి మీ సహచరుల, సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. మీ తెలివితేటలతో మీ వైరి వర్గంపై పైచేయి సాధిస్తారు. మీ స్ట్రాటజీలకు ఎంతటివారైనా చిత్తవ్వాల్సిందే.  శుభం భూయాత్.

మకర రాశి: చాలా కాలంగా ఉద్యోగ వేటలో ఉన్నవారికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మీలో చాలామంది ఉద్యోగానికి సంబంధించి క్రొత్త ప్రదేశానికి బదిలీ అయ్యే సూచనలు కనపడుతున్నాయి.  విదేశీ పర్యటనలు సైతం మీరు చేసే అవకాశం మెండు. ఈ ప్రయాణాల వల్ల మీకు అనేక సంతోషాలతోపాటు సానుకూల ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో పురోగతి సాధించడానికి మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. మీ శ్రమకు గుర్తింపు లభించి సత్కారాలను అందుకొంటారు. కొత్త వ్యాపారం లేదా పనిని ప్రారంభించకపోవడం మంచిది. కొద్దీ కాలమన్నా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి.  ఇప్పటికే వ్యాపారం చేస్తుంటే, మంచి ఫలితాలను పొందడానికి మీరు మరింత కష్టించాల్సి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ప్రయత్నాలు చేస్తారో, అంతగా మీకు విజయం లభిస్తుంది. మార్చి 30 నుండి జూన్ 30 వరకు గురు మీ రాశిలో  ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. విజయవంతమైన వృత్తిని పొందడానికి మీకు సహాయపడుతాడు. ట్రావెలింగ్, ఇంజనీరింగ్, ఐటి సెక్టార్ తదితర రంగాల వారు అత్యున్నత విజయం సాధిస్తారు.  మీరు పని చేసేచోట ఓపిక అవసరం. మీకు అసౌకర్యం, ఒత్తిడి అనిపిస్తే మీరు ఉద్యోగాన్ని వదిలివేస్తాననే దుస్సాహసానికి కూడా ప్రయత్నించవచ్చు. ఆచి తూచి వ్యవహరించండి.  అదనపు జాగ్రత్త అవసరం. నిగ్రహంతో వ్యవహరించండి, విజయం మీ ముంగిట ఉంటుంది.  శుభం భూయాత్.

కుంభ రాశి: ఈ సంవత్సరం మీరు తీసుకునే ఒక తెలివైన నిర్ణయం మీ వృత్తి విషయంలో ఎదుగుదలకు కారణమవుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఏడాది పొడవునా రిలాక్స్డ్ గా  ఉంటారు. ఈ సంవత్సరం మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది కాబట్టి ఇదే మంచి తరుణంగా భావించి దాన్ని విస్తరించే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతారు. వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడానికి అనుభవజ్ఞుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవాలని మీరు భావిస్తారు. అది మంచిదే.  నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగస్తులు సీనియర్‌లతో జాగ్రత్తగా ఉండాలి.  విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అనుకూల కలం. గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నవారికి అది లభిస్తుంది.  శుభం భూయాత్.

మీన రాశి : ఈ సంవత్సరం ప్రారంభామ నుంచే చాలా గొప్పగా ఉంటుంది. పనిలో ప్రశంసలు పొందుతారు. మీకు జనవరి నుండి మార్చి  వరకు గొప్ప సమయం గా చెప్పవచ్చు. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మిమ్మల్ని ప్రగతిపథంలో పయనింపజేస్తుంది.  జూన్ నాటికి మీ ఆదాయంలో ఇంక్రిమెంట్ కూడా పొందుతారు. మీ కృషి కారణంగా మీ సీనియర్లు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. ఆ భగవంతుడి అండదండలు, కృపా కటాక్షాలు మెండుగా ఉండడం వల్ల మీ ఉద్యోగం / వ్యాపారంలో విజయం పొందుతారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని అనుకుంటున్నవారికి ఇది అనుకూల కాలం.  షేర్ మార్కెట్లో పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారస్తులు గౌరవంతో పాటు ఈ సంవత్సరం ఎక్కువ లాభాలను కూడా ఆర్జిస్తారు. మీ ప్రత్యర్థుల నుండి ఒకింత దూరంగా ఉండడం మంచిది.  సంవత్సరం కాలం గడుస్తున్నకొద్దీ మీ అభివృద్ధి అంచెలంచెలుగా పెరుగుతుంది.  సంవత్సరం చివరినాటికి, మీరు కోరుకున్న స్థాయిలో లో మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. వృత్తి పరంగా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. శుభం భూయాత్.

loader