కరోనా మహమ్మారి భారతదేశంలో కల్లోలం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా ఏడుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను భారత్ లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.

Also Read:కరోనా దెబ్బ: దేశంలోని 75 జిల్లాల్లో లాక్ డౌన్?

ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేయగా తెలుగు రాష్ట్రాలు సహా రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. సాయంత్రం లేదా రేపు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ కానున్నాయి.

అలాగే ఈ నెల 31వ తేదీ వరకు రైళ్లు పూర్తిగా బంద్ కానున్నాయి. దేశంలోని అన్ని కీలక నగరాల్లోని మెట్రో సర్వీసులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 31 వరకు అంతర్రాష్ట్ర సర్వీసులు సైతం నిలిపివేయాలని తెలిపింది. కరోనా ప్రభావిత 75 జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:ఏపీలో తొలి కరోనా బాధితుడికి నెగిటివ్, కోలుకొన్న నెల్లూరు వాసి

దేశంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 341కి చేరింది. ఇవాళ గుజరాత్‌లో ఒకరు, మహారాష్ట్రలో ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులోనే దేశంలో ముగ్గురు మరణించడంతో భారత్‌లో పరిస్ధితి విషమిస్తున్నట్లుగా తెలుస్తోంది