న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.

also read:ఏపీలో తొలి కరోనా బాధితుడికి నెగిటివ్, కోలుకొన్న నెల్లూరు వాసి

కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆదివారం నాడు మధ్యాహ్నం  ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల్లో అవలంభించాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

దేశంలోని 75 జిల్లాల్లో నెలకొని ఉన్న పరిస్థితులపై కేంద్రం ఆరా తీసింది. ఈ వ్యాధిని ఇతరులకు పూర్తిగా  వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకొంది కేంద్రం. 

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేయాలని కేంద్రం సూచిస్తోంది.డిల్లీలో మెట్రో సర్వీసులను రద్దు చేయాలని కేంద్రం సూచించింది. ఇతర రాష్ట్రాల్లో కూడ మెట్రో సర్వీసులను రద్దు చేయాలని కూడ సూచించింది.ఈ మేరకు ఆదివారం నాడు సాయంత్రం ఈ విషయమై కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.