అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కరోనా వైరస్ నుండి కోలుకొంటున్నట్టుగా వైద్యులు ప్రకటించారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత ఆయన కోటుకొన్నాడని వైద్యులు ప్రకటించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడికి  కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. దీంతో అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉన్న యువకుడికి వైద్యులు తాజాగా మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆ యువకుడికి కరోనా నెగిటివ్ వచ్చినట్టుగా  తేలింది.

also read:నెల్లూరులో వ్యక్తికి కరోనా లక్షణాలు

ఇటలీ నుండి వచ్చిన ఆ యువకుడికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా ఈ నెల 11వ తేదీన అధికారులు గుర్తించారు. నెల్లూరు పట్టణానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు రావడంతో పట్టణంలో రథోత్సవాన్ని కూడ ఆ సమయంలో నిలిపివేశారు.

also read:కరోనా ఎఫెక్ట్: ఎక్కడ రైళ్లు అక్కడే, గూడ్స్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం

ఇటలీలో ఉండే ఆ యువకుడు కరోనా వ్యాధి కారణంగా ఆయన స్వగ్రామానికి వచ్చాడు. ఇటలీ నుండి ఢిల్లీ, చెన్నై మీదుగా ఆయన నెల్లూరుకు చేరుకొన్నారు. ఢిల్లీ, పూణె విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినా ఆ సమయంలో పెద్దగా ఫలితం లేకపోయింది.

అయితే ఆ యువకుడి శాంపిల్స్ పూణెకు పంపడంతో పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ యువకుడిని ఐసోలేషన్  వార్డులో ఉంచి నిర్వహించిన చికిత్స ఫలితాన్ని ఇచ్చింది.