భారత్‌లో కరోనా బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నాలుగో కరోనా మరణం సంభవించింది. పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి వైరస్‌తో మరణించినట్లుగా తెలుస్తోంది.

ఇంతకుముందు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీల్లో కరోనా సోకిన వారు మరణించారు. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ గురవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Also Read:వెంటాడుతున్న కరోనా భయం.. అమ్మో వాళ్ల బట్టలు ఉతికేది లేదంటున్న ధోబీలు

విదేశాల్లో ఉన్న 276 మంది భారతీయులకు కూడ కరోనా సోకినట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిలో 255 మంది ఇరాన్‌లో ఉన్నవారేనని కేంద్రం స్పష్టం చేసింది. 

ఇటలీ, యూఏఈ, కువైట్, హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంక  దేశాల్లో ఉన్న  భారతీయులకు ఈ వ్యాధి సోకినట్టుగా భారత ప్రభుత్వం తెలిపింది.మరోవైపు ఇండియాలో 150 మందికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్టుగా కేంద్రం ప్రకటించింది.. కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.

Also Read:శ్రీ వెంకటేశ్వరుని తాకిన కరోనా: తిరుమల ఆలయం మూసివేత

కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  కరోనా విషయంలో అలసత్వం వహించకూడదని కేంద్రం కూడ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది.