వెంటాడుతున్న కరోనా భయం.. అమ్మో వాళ్ల బట్టలు ఉతికేది లేదంటున్న ధోబీలు
భారత్‌లో కరోనా చాప కింద నీరులా పాకుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా భయంతో ఇప్పటికే మాంసాహరానికి దూరమైన జనం.. పక్కవారు తుమ్మినా, దగ్గినా భయపడిపోతున్నారు.
భారత్‌లో కరోనా చాప కింద నీరులా పాకుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా భయంతో ఇప్పటికే మాంసాహరానికి దూరమైన జనం.. పక్కవారు తుమ్మినా, దగ్గినా భయపడిపోతున్నారు.
Also Read:కరోనా వైరస్: కరీంనగర్ లో హై అలర్ట్, 144 సెక్షన్ అమలు
ఇక దేశంలోనే అత్యంత వేగంగా కరోనా విస్తరిస్తున్న మహారాష్ట్రలో పరిస్ధితి రోజురోజుకే చేజారుతోంది. కరోనా పేషేంట్ల బట్టలు ఉతకమని ధోబీలు తేల్చి చెప్పేస్తున్నారు. తమకూ ఆ వైరస్ సోకుతుందేమోనన్న భయంతో వారు వెనకడుగు వేస్తున్నారు.
సాధారణంగా ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో వినియోగించే వస్త్రాలను స్థానికంగా పనిచేసే ధోబీలతో ఉతికిస్తారు అధికారులు. అదే విధంగా మహారాష్ట్రలోని యవత్కల్ స్థానిక ఆసుపత్రిలో సోమవారం అన్ని వార్డులతో పాటు ఐసోలేషన్ వార్డులో వినియోగించిన బెడ్ షీట్లు, కర్టెన్లు, పేషెంట్ల వస్త్రాలను ఉతకమని ధోభీలకు ఇచ్చారు.
Also Read:కరోనా ఎఫెక్ట్: విదేశాల నుండి వచ్చిన వరుడు, పెళ్లికి అధికారుల అభ్యంతరం
అయితే వారు తాము ఉతకలేమని తేల్చి చెప్పేశారు. ఐసోలేషన్ వార్డులో ఉపయోగించిన బట్టలు ముట్టుకుంటే తమకు ఆ వైరస్ సోకుతుందేమోనని భయంగా ఉందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ధోబీ చెప్పారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 47కి చేరింది. వైరస్ సోకినవారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.