Coronavirus: ఢిల్లీ, ముంబ‌యిలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు.. కానీ !

Coronavirus: భార‌త్ లోనూ క‌రోనా ప్ర‌భావం అధికం అవుతూనే ఉంది. రోజువారీ కేసులు మూడు ల‌క్ష‌ల మార్కును దాటాయి. క‌రోనా పంజా విసురుతున్న దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో క‌రోనా కొత్త కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌రోనా విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. 
 

Coronavirus Delhi Sees Another Dip In Daily Caseload Mumbai Reports 5008 Infections

Coronavirus: క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. దీని కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. కోవిడ్‌-19 కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధిక‌మ‌వుతున్న‌ది. చాలా దేశాల్లో నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా ప్ర‌భావం పెరుగుతోంది. రోజువారీ కేసులు మూడు ల‌క్ష‌ల మార్కును దాటాయి. చాలా రాష్ట్రాల్లో కొత్త‌గా క‌రోనా వైర‌స్ (Coronavirus) బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్న‌ది. దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో వైర‌స్ వ్యాప్తిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అయితే, తాజాగా ఆయా ప్రాంతాల్లో క‌రోనా కొత్త కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ (Delhi) లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 10,756 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజు ఇక్క‌డ 12,306 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. క‌రోనా మ‌హ‌మ్మారి పాజిటివిటీ రేటు కూడా 21.48 శాతం నుంచి 18 శానికి తగ్గింద‌ని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు ఢిల్లీలో 25,541కి పెరిగాయి. ప్ర‌స్తుతం 61,954 యాక్టివ్ (Active cases) కేసులు ఉన్నాయి.  ఇదిలావుండ‌గా, క‌రోనా (Coronavirus) కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేయడంతోపాటు దుకాణాలను తెరవడానికి సరి-బేసి విధానాన్ని తొలగించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ శుక్రవారం తిరస్కరించారు. అయితే, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లో 50 శాతం సామ‌ర్థ్యంతో నిర్వ‌హించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. Delhiలో క‌రోనా ప‌రిస్థితులు మ‌రింత‌గా మెరుగుప‌డిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.

 

ముంబయిలోనూ స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల.. 

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి (Mumbai) లోనూ క‌రోనా వైర‌స్ (Coronavirus) కొత్త కేసులు స్వ‌ల్పంగా త‌గ్గాయి. కొత్త‌గా ముంబ‌యిలో 5008 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే 700  కేసులు త‌క్కువ‌. అలాగే, కొత్త‌గా క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 12 మంది ప్రాణాలు కోల్పోయార‌ని బృహన్ ముంబ‌యి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా, ముంబ‌యి (Mumbai) లో ప్రీ-ప్రైమరీ తరగతులతో సహా అన్ని పాఠశాలలను జనవరి 24న పునఃప్రారంభించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తిరిగి తెరవడానికి అనుమతిని ఇచ్చింది. అయితే, స్థానికంగా ఉన్న కోవిడ్ (Coronavirus) ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకునేందుకు స్థానిక పరిపాలన యంత్రాంగానికి అధికారం ఇచ్చింది.

 

ద‌క్షిణాది రాష్ట్రాల్లో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి.. 

దక్షిణాది రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ (Coronavirus) విజృంభ‌ణ క్ర‌మంగా పెరుగుతున్న‌ది. క‌ర్నాట‌క‌, కేర‌ళ‌లో అయితే, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క‌ర్నాట‌క (Karnataka) లో కొత్త రికార్డులు న‌మోదుచేస్తూ.. ఒక్క‌రోజే 47,000 కేసులు నమోదయ్యాయి. అయితే, ఒక్క బెంగ‌ళూరులోనే 30,000 కేసులు వెలుగుచూడ‌టం సిటీ (Bengaluru) లో క‌రోనా పంజాకు అద్దం ప‌డుతున్న‌ది. కేర‌ళ (Kerala) లో మ‌ళ్లీ 41 వేల‌కు పైగా క‌రోనా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. కరోనా విజృంభ‌ణ నేప‌థ్య‌లో లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు విధించింది. అలాగే, ఈ నెల 23. 30న రెండు రోజుల రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. త‌మిళ‌నాడులోనూ కొత్త‌గా (Tamil Nadu) 29,870 కేసులు న‌మోద‌య్యాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios