ప్రస్తుతం భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ జన జీవనంతో పాటు ఆర్ధిక, సామాజిక అంశాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌ను సిరీస్‌ను రద్దు చేసిన బీసీసీఐ ఐపీఎల్‌ను వాయిదా వేసింది.

Also Read:కరోనాకు పారాసిటమాల్... కేసీఆర్, జగన్ లు చెప్పింది నిజమేనంటున్న డాక్టర్లు

ఆ తర్వాత అయినా ఇది జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. కరోనా కారణంగా బీసీసీఐ వేలాది కోట్ల ఆదాయాన్ని నష్టపోయే ప్రమాదంలో పడింది. ఇదే సమయంలో ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది.

రేపటి నుంచి ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కరోనాను కట్టడి చేసేందుకు జనం ఎక్కువగా హాజరయ్యే క్రీడలు జరగకుండా చూడాలని బీసీసీఐ దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read:ఐసొలేషన్ లో ఉండకుండా తప్పించుకున్న కరోనా సోకిన టెక్కీ భార్య అరెస్టు

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కోవిడ్-19 వేగంగా విస్తరిస్తోంది. సోమవారం మరో నాలుగు కేసులు నమోదు కావడంతో మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 37కి చేరింది. దీని కారణంగా మహారాష్ట్రలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. ముంబైలోని అతి ప్రాచీన సిద్ది వినాయక ఆలయంతో పాటు ప్రఖ్యాత తుల్జా భవానీ దేవాలయాన్ని మూసివేశారు.