Asianet News Telugu

కరోనాకు పారాసిటమాల్... కేసీఆర్, జగన్ లు చెప్పింది నిజమేనంటున్న డాక్టర్లు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ పై మాట్లాడుతూ కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ వల్ల ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చంటూ చేసిన కామెంట్స్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వారి మాటలపై ఏపి డాక్టర్లు స్పందించారు. 

Telugu CMs Paracetamol Comments over Corona Virus...  AP Doctors Reacts
Author
Vijayawada, First Published Mar 16, 2020, 8:51 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షలమంది ప్రాణపాయస్థితిలోకి వెళ్లగా వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే భారత్ లోకి కూడడా ప్రవేశించిన ఈ  వైరస్ ప్రజల్లో భయాందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎక్కువగా ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. 

ఇలాంటి భయంకరమైన వైరస్ ను ప్రభావాన్ని తగ్గించడానికి సాధారణ జ్వరానికి వాడే పారాసిటమాల్ వాడతారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లు తెలిపారు.  వీరి కామెంట్స్ పై ప్రత్యర్థి పార్టీల నాయకులతో పాటు సాధారణ ప్రజలు, సోషల్ మీడియా యూజర్లు విమర్శలు చేశారు. అయితే వీరు మాట్లాడిన దాంట్లో ఎలాంటి అబద్దం లేదని... నిజంగానే ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి పారాసిటమాల్ వాడతామంటూ ఏపి డాక్టర్లు వెల్లడించారు. 

విజయవాడ ప్రభుత్వ ఆసుప్రతిలో వైద్య నిపుణులు కరోనా వైరస్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాంచారయ్య మాట్లాడుతూ... కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్వైన్ ఫ్లూ, సార్స్ కన్నాఈ వైరస్ ప్రమాదకరమైనది కాదన్నారు. 

కరోనా వైరస్ వల్ల మొదట బాధితుడికి జ్వరం లక్షణాలు వస్తాయని తెలిపారు. ఏ వైరల్ ఫీవర్ వచ్చినా మొదట పేషంట్ కు ఇచ్చేది పారాసెటమాల్ టాబ్లెటేనని తెలిపారు. కరోనా వల్ల మొదట విపరీతమైన జ్వరం వస్తుందని... అది పెరిగితే దాని ప్రభావం మెదడుపై వుంటుందన్నారు. కాబట్టి  ముందుగా జ్వరంను నియంత్రించేందుకు పారాసెటమాల్ వాడుతామని... ఆ తరువాత యాంటీబయాటిక్స్ వాడటం ప్రారంభిస్తామన్నారు. 

read more కరోనానే పట్టుకున్న చంద్రబాబు: చర్యలపై జగన్ వెనకంజ, కారణం ఇదే...

ఈ వైరస్ నివారణకు డబ్ల్యుటిఓ ఖచ్చితమైన మందులను సూచించలేదని తెలిపారు. వ్యాధి లక్షణాలను బట్టి నిపుణులైన వైద్యులు సూచించిన మందులను వాడుతున్నట్లు తెలిపారు. పారాసెటమాల్ అనే మందు చాలా సేఫ్ డ్రగ్ అని...ఇది కిడ్నీ మీద ఎటువంటి ప్రభావం చూపించదని తెలిపారు. అంతకు మించిన ఇతర డ్రగ్స్ వాడితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందన్నారు. 

జ్వరానికి పారాసెటమాల్ అనేది సంజీవనిలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పది నుంచి పదిహేను నిమిషాల్లోనే పారాసెటమాల్ జ్వరం వల్ల వచ్చే ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని తెలిపారు. అన్ని దేశాల్లోనూ జ్వరం వచ్చినప్పుడు ఈ పారాసెటమాల్ మందులనే వాడుతున్నారని... కరోన వైరస్ వల్ల ప్రారంభమయ్యే జ్వరంకు కూడా ఇదే మందు చక్కగా పనిచేస్తుందని వెల్లడించారు. 

కరోనా వైరస్ వల్ల ఏపిలో భయానక పరిస్థితులు లేవన్నారు. విజయవాడకు ఇటలీ, దుబాయ్, మస్కట్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేశామన్నారు. కాకినాడ, ఒంగోలు నుంచి కూడా బ్లడ్ శాంపిళ్లు వస్తున్నాయని తెలిపారు. విజయవాడలోని వైరాలజీ ల్యాబ్ లో ఈ శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు... ముందుగా మూడు గంటల పరీక్షలో వైరస్ ను గుర్తిస్తున్నట్లు తెలిపారు. దానిని నిర్ధారించడానికి మరో మూడు గంటలు పడుతుందన్నారు. 

ప్రస్తుతం నలబై మంది విదేశాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ పరీక్షలు చేశామన్నారు. ఒక్క అయిదుగురికి మాత్రమే లక్షణాలు వున్నాయని గుర్తించి పరీక్షలు చేశామని... వీరిలో ఎవరికీ పాజిటీవ్ రాలేదన్నారు. దీంతో వారిని ఇళ్లకు పంపించి డిఎం అండ్ హెచ్ఓ లకు సమాచారం ఇచ్చామన్నారు. వారి సర్వేలైన్స్ లో అనుమానితులు ఇళ్ళ వద్ద వుంటారని తెలిపారు. 

ఇంటివద్ద వున్న పేషంట్లను ప్రతిరోజూ ఆరోగ్య కార్తకర్తలు పరీక్షిస్తారని తెలిపారు. వియవాడలో ఇప్పటి వరకు ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ప్రభుత్వ పరంగా వైద్యశాల్లో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని... విజయవాడ ఆసుపత్రిలో కరోనా వైరస్ బాధితులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అన్నారు.

read more   కరోనా నియంత్రణను అడ్డుకున్నది నిమ్మగడ్డ, చంద్రబాబులే...ఎలాగంటే: సజ్జల సంచలనం

విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి, వ్యాధి లక్షణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  వ్యాధి లక్షణాలు లేకపోయినా అనుమానితులు ఇల్లు కదిలి వెళ్లకుండా వుండాలని సూచన చేస్తున్నామన్నారు. 28 రోజుల పాటు జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఇంటి వద్దే వుండేలా చూస్తున్నామన్నారు. విజయవాడ హాస్పిటల్ లోలో పది ఐసోలేషన్ వార్డ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు నాంచారయ్య తెలిపారు. 

కరోనా వైరస్ యాబై ఏళ్ళ పైబడిన వారికి... వ్యాధి నిరోధకత తక్కువ ఉన్న వారికి, మధుమేహం వున్న వారికి ప్రమాదకరమన్నారు. మిగిలిన వారికి ఈ వైరస్ వల్ల అంతగా ప్రమాదం లేదని తెలిపారు.  వైరస్ వల్ల బాధింపబడినవారికి పారాసెటమాల్ ఇవ్వడంతో పాటు యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల తీవ్రతను తగ్గించవచ్చని వెల్లడించారు. 

యాంటీబయాటిక్, పారాసెటమాల్, వెంటిలేటర్ సదుపాయంతో  వైరస్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించవచ్చని తెలిపారు. విజయవాడలోని ఐసోలేషన్ వార్డులతో పాటు 46 బెడ్ల అత్యాధునిక ఐసియులను ఏర్పాటు చేసినట్లు... పేషంట్లకు వెంటీలేటర్ సపోర్ట్ తో పాటు అన్ని సదుపాయాలు కల్పించనున్నామని నాంచారయ్య స్పష్టం చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios