Coronavirus: ఒక్క వారంలోనే 44 వేలకు పైగా కోవిడ్ మరణాలు

Coronavirus: క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన త‌ర్వాత చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు కొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఒక్క‌వారంలోనే 44 వేల‌కు పైగా క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం వైర‌స్ ఉధృతికి అద్దం ప‌డుతున్న‌ది. 
 

Coronavirus across the world

Coronavirus: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతుండ‌టంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ప‌లు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ తో పాటు డెల్టా వేరియంట్ ప్ర‌భావం సైతం పెరుగుతున్న‌ది. దీంతో ఆయా దేశాల్లో ప‌రిస్థితులు మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారుతున్నాయి. క‌రోనా వైర‌స్ కొత్త కేసుల్లో వారంత‌పు గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే.. ఏకంగా 55 శాతం పెరుగుద‌ల చేసుకోవ‌డం తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. గ‌త వారం రోజుల్లో అన్ని దేశాల్లో క‌లిపి క‌రోనా వైర‌స్ కార‌ణంగా 44 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న క‌రోనా వైర‌స్ (Coronavirus) వివ‌రాల‌ను వెల్ల‌డిస్తున్న వ‌ర‌ల్డో మీట‌ర్ క‌రోనా వైర‌స్ డాష్ బోర్డు వివ‌రాలు గ‌మ‌నిస్తే.. గ‌త వారం రోజుల్లో ప్ర‌పంచవ్యాప్తంగా 17,632,012 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌త వారంతో పోలిస్తే.. 55 శాతం పెరుగుద‌ల. ఇదే స‌మ‌యంలో 44,411 మంది క‌రోనా (Coronavirus) కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణాలు సైతం పెరిగాయి. 

 ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల్లో ఏకంగా 17,632,116 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు 44,412 నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 55  శాతం, మరణాల్లో 6 శాతం పెరుగుదల నమోదైంది. దేశాల వారీగా గణాంకాలు గమనిస్తే.. వారంలో కొత్త కేసుల పెరుగుదల 42 శాతం నమోదైంది.  ఫ్రాన్స్ లో 61 శాతం, ఇటలీలో 59 శాతం పెరిగాయి. అత్యధికంగా భారత్ లో 470 శాతం కొత్త కేసుల పెరుగుదల నమోదైంది. అలాగే, అర్జెంటీనాలో 155 శాతం, ఆస్ట్రేలియాలో 193 శాతం కేసులు ఒక్క వారంలోనే పెరిగాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 311,314,799 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  కరోనా వైరస్ (Coronavirus) తో పోరాడుతూ 5,514,602 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 260,840,723  మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అన్ని దేశాల్లో కలిపి నిత్యం 25 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరనా వైరస్ కేసులు అధికంగా నమోదైన దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. యూఎస్ లో ఇప్పటివరకు మొత్తం 62,661,272 కరోనా వైరస్ (Coronavirus) కేసులు నమోదయ్యాయి. ఇందులో 861,336 మంది కోవిడ్19 కారణంగా మరణించారు. ప్రస్తుతం నమోదవుతున్న ప్రపంచవ్యాప్త కొత్తకేసుల్లో అత్యధికం అమెరికాలోనే నమోదవుతున్నాయి. అలాగే, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతున్నది. దీనికి తోడు కొత్తగా కరోనా (Coronavirus) బారినపడుతున్న వారిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అధికంగా ఉంటున్నారు. దీంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర  ప్రభావం పడింది. ఇక కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికం ఉంటున్నాయని అక్కడి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  కరోనారోగులతో అక్కడి ఆస్పత్రులు నిండిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు టాప్-3లో ఉన్నాయి. ఆ త‌ర్వాతి స్థానంలో యూకే, ఫ్రాన్స్, ర‌ష్యా, ట‌ర్కీ, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, స్పెయిన్‌, అర్జెంటీనా, ఇరాన్‌, కొలంబియా దేశాలు ఉన్నాయి. భార‌త్ లో  క‌రోనా వైర‌స్ కేసులు వారంలోనే గ‌ట‌న‌నీయంగా పెరిగాయి. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న (Coronavirus) ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios