పరిమితమైన సడలింపులతో లాక్ డౌన్ కొనసాగింపుకు రాష్ట్రాల మొగ్గు?
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను పరిమితమైన సడలింపులతో లాక్‌డౌన్ ను కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. ప్రధాని మోడీతో వీడియో కాన్పరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల సీఎంలు చెప్పే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను పరిమితమైన సడలింపులతో లాక్‌డౌన్ ను కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. ప్రధాని మోడీతో వీడియో కాన్పరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ఆయా రాష్ట్రాల సీఎంలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ను కొనసాగించేందుకు సంకేతాలు ఇస్తున్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్గూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రం మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది.అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడ కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు.
ఢిల్లీ రాష్ట్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్ ను పొడిగించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్. పంజాబ్ రాష్ట్రాలు కూడ లాక్ డౌన్ ను పొడిగించేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాయి. కనీసం హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొనసాగించాలని ఆ రాష్ట్రాలు భావిస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చాయి.
గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హార్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారంగా ముందుకు వెళ్తామని ప్రకటించాయి. అస్సాం, కేరళ, బీహార్ రాష్ట్రాలు మాత్రం ఈ నెల 27న ప్రధాని మోడీతో వీడియో కాన్పరెన్స్ తర్వాత లాక్ డౌన్ పొడిగింపు విషయమై నిర్ణయం తీసుకొంటామని చెబుతున్నాయి.
ఢిల్లీ పట్టణంలో 92 కరోనా హాట్ స్పాట్స్ ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ ప్రకటించారు.ఢిల్లీ నగరం మొత్తం రెడ్ జోన్ కాదన్నారు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 'ఉల్లి'తో ఇల్లు చేరుకొన్నాడు
మహారాష్ట్రలోని పుణె, ముంబైలలోని రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం లేకపోలేదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. రాష్ట్రంలో 6817 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 301 మంది మృతి చెందారు. 957 మంది రికవరీ అయ్యారని ఆయన చెప్పారు.
కొన్ని సడలింపులతో లాక్ డౌన్ ను కొనసాగించేందుకు కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ నెల 27వ తేదీన ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ , ఆయా రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సీఎంలతో చర్చించనున్నారు.
ప్రధానితో వీడియో కాన్పరెన్స్ తర్వాత లాక్ డౌన్ విషయమై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు స్పష్టంగా ప్రకటించే అవకాశం లేకపోలేదు.