Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో Omicron కలకలం... 578కి చేరిన కేసులు... తెలుగురాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ...

భారత్ లో కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ మెల్లిగా కోరలు చాస్తోంది. ఇప్పటివరకే ఈ మహమ్మారి 19 రాష్ట్రాల్లో విస్తరించి విజృంభణకు సిద్దమయ్యింది. 

corona new variant omicron upadates in india
Author
Hyderabad, First Published Dec 27, 2021, 11:46 AM IST

హైదరాబాద్: కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఈ మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది. ఇలా భారత దేశంలోకి కూడా ప్రవేశించిన ఒమిక్రాన్ మెల్లిగా అన్ని రాష్ట్రాల్లోకి వ్యాపిస్తోంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరింది. 

దేశంలోని 19 రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా న్యూడిల్లీలో 142 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 141, కేరళ 57, గుజరాత్ 49, రాజస్థాన్ 43, తెలంగాణ 41, తమిళనాడు 34, కర్ణాటక 31 కేసులు నమోదయ్యాయి. ఇక మధ్య ప్రదేశ్ 9, ఆంధ్ర ప్రదేశ్ 6, పశ్చిమ బెంగాల్ 6, హర్యానా 4, ఒడిషా 4, చత్తీస్ ఘడ్ 3, జమ్మూ కాశ్మీర్ 3, ఉత్తర ప్రదేశ్ 2, హిమాచల్ ప్రదేశ్ 1, లడక్ 1, ఉత్తరాఖండ్ 1 ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది.

ఇలా ఇప్పటికవరకు మొత్తం 578ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవగా వీరిలో  151మంది ఇప్పటికే కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 42మంది కోలుకోగా రాజస్థాన్ 30, న్యూడిల్లీలో 23, కర్ణాటక 15, తెలంగాణ 10, గుజరాత్ 10మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది.

Read More  టీకా తీసుకోమంటే.. కర్రతో దాడిచేసి.. పోలీస్ చెయ్యి విరగ్గొట్టాడు..

 ఇదిలాఉంటే దేశంలో సాధారణ క‌రోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,531 కేసులు నమోదయ్యాయి. కేసుల కంటే ఎక్కువగా 7,141 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 75,841 యాక్టివ్ కేసులు వున్నాయని వెల్లడించారు. దేశంలో రికవరీ రేట్ 98.40శాతంగా వుంది. 

తెలుగురాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.  

విదేశాల నుండి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇలా ఇప్పటివరకు ఒమిక్రాన్ నిర్దారణ అయిన ఆరుగురు విదేశాల నుండి వచ్చినవారే.   

read more  తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా ముగ్గురికి పాజిటివ్, 44కి చేరిన మొత్తం కేసులు

ఎట్ రిస్క్ దేశాల నుండి వచ్చిన ఇద్దరికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహించారు. ఒకరు దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాదు మీదుగా ప్రకాశం జిల్లా ఒంగోలు కు రాగా మరొకరు యుకె నుంచి బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లాకు వచ్చాడు. అయితే కరోనా పరీక్షలో వీరికి పాజిటివ్ రావడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెలింగ్ కు పంపించారు.  సిసీఎంబీలో పరీక్షలు చేయగా ఇద్దరికీ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

వెంటనే ఇరు జిల్లాలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమైన ఒమిక్రాన్ బారినపడ్డ ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. అలాగే వీరి కుటుంబసభ్యులతో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కు కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ లో ఎవరికీ కరోనా నిర్దారణ కాలేదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios