వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి వై-కేటగిరీ భద్రత.. ఎందుకంటే ?

స్వయం ప్రకటిత దైవం, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వై-కేటగిరి భద్రత కల్పించింది. దేశ వ్యాప్తంగా కూడా ఆయనకు అలాంటి భద్రతే కల్పించాలని ఆ రాష్ట్ర పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. 

Controversial self-proclaimed divine Dhirendra Krishna Shastri gets Y-category security.. because ?..ISR

వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అలియాస్ 'బాగేశ్వర్ ధామ్ సర్కార్'కు వై-కేటగిరీ భద్రత కల్పించే ఉత్తర్వులకు మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే శాస్త్రికి వై-కేటగిరీ భద్రత కల్పించిన విషయాన్ని తెలియజేస్తూ మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్ర పోలీసు బలగాలకు లేఖ రాశారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి మధ్యప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రదేశాల్లోని దేవాలయాలను సందర్శించేటప్పుడు ఆయనకు ఇదే విధమైన భద్రత కల్పించాలని అందులో అభ్యర్థించారు.

పార్లమెంటు ప్రారంభోత్సవానికి మేము వస్తాం.. ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించిన రెండు పార్టీలు.. ఏవంటే ?

మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారే ధీరేంద్ర శాస్త్రి. ఆయన బాగేశ్వర్ ధామ్ సర్కార్ గా ప్రసిద్ధి చెందారు. ఆయన ఆ తన సొంత రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రాచుర్యం పొందారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ‘కథ’ అని పిలిచే మతపరమైన ప్రసంగాలు చేస్తుంటారు. అలాగే  ‘‘దివ్య దారాబార్’’ అనే కార్యక్రమం నిర్వహించడానికి ఆయన వివిధ రాష్ట్రాలను సందర్శిస్తారు. 

అయితే తరచూ పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ ఆయన వివాదాల్లో నిలుస్తుంటారు. ఇటీవల పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతడి మిత్రపక్షం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్ పై విమర్శలు గుప్పించారు. తనకు రహస్య శక్తులు ఉన్నాయని చెప్పుకునే ఆయన.. కొంత కాలం కిందట అనేక మంది ఆరాధ్య దైవం సాయిబాబాపై కూడా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రజలను ఆహ్వానించిన యోగి ఆదిత్యనాథ్

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో గత నెలల నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాయిబాబా దేవుడు కాడని, ఓ ఫకీరు మాత్రమే అని అన్నారు. సాయిబాబాకు శంకరాచార్యులు దైవస్థానం ఇవ్వలేదని ధీరేంద్ర శాస్త్రి చెప్పారు. ‘‘శంకరాచార్యులు మన ధర్మానికి ప్రధాని కాబట్టి ఆయనను గౌరవించడం ప్రతీ సనాతనీ కర్తవ్యం. గోస్వామి తులసీదాస్ జీ అయినా, సూర్దాస్ జీ అయినా మన ధర్మానికి చెందిన ఏ సాధువు అయినా కానివ్వండి.. ఆయనను గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు, కల్ప పురుషుడు అనొచ్చు. కానీ దేవుడు అనలేం’’ అని అన్నారు. అయితే ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయలేమని, కానీ సాయిబాబా సాధువు, ఫకీరు కావచ్చు కానీ దేవుడు కాలేరని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై శివసేన, కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలపై శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) యువసేన నాయకుడు రాహుల్ కనల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు అయ్యింది. 

గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కాగా.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్ జిల్లాలో మతపరమైన ప్రవచనాలు నిర్వహిస్తున్న శాస్త్రి ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పర్యటించున్నారు. అక్కడి సూరత్, అహ్మదాబాద్, రాజ్ కోట్ నగరాల్లో 'దివ్య దర్బార్' నిర్వహించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios