Asianet News TeluguAsianet News Telugu

ఆమె ఓ లేడీ అర్జున్ రెడ్డి.. ఫుల్లుగా మందేసి వచ్చి స్కూల్ పిల్లలకు పాఠాలు.. టీచర్ సస్పెండ్...

కర్ణాటకలో ఓ స్కూల్ ఉపాధ్యాయిని మద్యానికి బానిసై.. తాగి స్కూలుకు వస్తూ... అలాగే పాఠాలు బోధిస్తోంది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేశారు. 

Lady school teacher suspended for turning up drunk regularly in Karnataka
Author
First Published Sep 9, 2022, 7:53 AM IST

కర్ణాటక : మద్యం సేవించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయినిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది.  ఉపాధ్యాయిని ఉదయాన్నే మద్యం సేవించి పాఠాలు బోధిస్తున్న సంఘటనలో అధికారుల పరిశీలనలో దొరికిపోయారు.ఇక సారంగి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని గంగలక్ష్మమ్మ మద్యం సేవించి పాఠాలు బోధిస్తూ ఉండేవారు. ఈమె పాతికేళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐదేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో విద్యార్థులను కారణం లేకుండానే కొట్టడం, తిట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగుతున్నారు అని స్థానికులుపేర్కొంటున్నారు. విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయిని గంగాలక్ష్మమ్మకు ఎన్నిసార్లు తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయినికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తాలూకా విద్యాధికారి (బీఈవో) హనుమానాయక్ పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తరువాత ఉపాధ్యాయిని టేబుల్ డ్రాను పరిశీలించడానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు. 

దళిత బాలికపై అత్యాచారం.. కేసు పెట్టడానికి వెళితే నైట్ అంతా స్టేషన్‌లోనే.. పోలీసుల దాడి

గ్రామస్తులు టేబుల్ డ్రాకు తాళాలు పగులగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసా, రెండు కాళీ సీసాలు లభించాయి. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహం చెందిన గంగలక్ష్మమ్మ.. తన గదిలోకి వెళ్లి తాళాలు వేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటానని హంగామా సృష్టించింది. దీంతో కంగారు పడ్డ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి మద్యం సీసాలను జప్తు  చేశారు. ఉపాధ్యాయుని లక్ష్మమ్మ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. 

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 17న టీచర్ కు సంబంధించి మానవత్వం మంటగలిసే ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో వెలుగుచూసింది. ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే ఓ మహిళను సజీవదహనం చేసినా.. ఆమెను రక్షించాల్సింది పోయి.. వీడియోలు తీసుకున్నారు. ఈ ఘటన ఏడు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చనిపోయిన మహిళ ఉపాధ్యాయురాలని తెలుస్తోంది. వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని ఒక గ్రామంలో 32 ఏళ్ల మహిళకు నిందితులు నిప్పటించి, సజీవదహనం చేసే ప్రయత్నం చేశారు. 

ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరు రోజుల తరువాత మరణించింది. ఆమె ఉపాధ్యాయురాలని, ఆమె తన కొడుకుతో కలిసి ఆగస్టు 10 న పాఠశాలకు వెళ్తుండగా నిందితులు ఆమెపై దాడి చేశారని తెలిసింది. వారు ఆమె మీద దాడి చేసి చేశారు. ఆమె వారినుంచి తప్పించుకున్న అదే కాలనీలోని ఓ ఇంటిలోకి వెళ్లి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె 100 నంబర్‌కు ఫోన్ చేసి తాను ఎక్కడుందో.. తనమీద ఎలాంటి దాడి జరుగుతుందో చెప్పింది. కానీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. ఈ క్రమంలోనే నిందితులు బాధితురాలిని పట్టుకుని.. ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

అయితే ఇదంతా చూస్తున్న స్థానికులు మాత్రం ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. పైగా వీడియోలు తీస్తూనే ఉన్నారు, ఆమె మంటల వేడికి తట్టుకోలేక బాధతో కేకలు వేస్తున్నా ఎవరూ ఆమెకు సహాయం చేయలేదు. అయితే, ఇలా జరగడానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. స్థానికుడైన భాస్కర్ కథనం ప్రకారం, బాధితురాలు నిందితుడికి డబ్బు అప్పుగా ఇచ్చింది. అయితే ఎంతకాలానికీ వాపసు ఇవ్వకపోవడంతో... డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగింది. అలా అడిగిందని ఇంత దారుణానికి ఒడిగట్టారు.

అంతకు ముందు ఓసారి కూడా డబ్బులు ఇవ్వమని అడుగుతుందని దాడికి ప్రయత్నించగా.. ఆమె వారిపై మే 7 న కేసు కూడా నమోదు చేసింది. అయినా వారిపై చర్యలు లేకపోవడంతో.. ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. 70% కాలిన గాయాలతో బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు రోుల పాటు చికిత్స పొందింది. తరువాత జైపూర్‌లోని SMS ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఏడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది. కొందరు పోలీసులు నేరగాళ్లతో కుమ్మక్కయ్యారని, అందుకే వారి ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె భర్త ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios