పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్ చేసినందుకు.. కౌగిలించుకోమన్న కానిస్టేబుల్.. అవాక్కైన జర్నలిస్ట్

First Published 12, Jul 2018, 6:26 PM IST
constable asks hug to women journalist for doing passport verification
Highlights

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేసినందుకు మహిళను తనను కౌగిలించుకోమని ఓ వింత కోరిక కోరాడు ఓ కానిస్టేబుల్.. 

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేసినందుకు మహిళను తనను కౌగిలించుకోమని ఓ వింత కోరిక కోరాడు ఓ కానిస్టేబుల్.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్టు ఒకరు తన పాస్‌పోర్టు రెన్యువల్ చేయించుకునే ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్‌ నిమిత్తం ఓ కానిస్టేబుల్ ఆమె ఇంటికి వచ్చాడు..అన్ని పత్రాలు పరిశీలించి వెరిఫికేషన్ పూర్తయ్యిందన్నాడు.. అనంతరం "నీ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేశాను.. మరి నాకు ఏం ఇస్తావ్" అని అడుగుతూ "ఒక్కసారి కౌగిలించుకోవాలని" అడిగాడు..

అతని నోటి వెంట ఆ మాట వచ్చిన వెంటనే మహిళా జర్నలిస్టు బిత్తరపోయింది.. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ సహా ఘజియాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ‘‘ ఓ పోలీస్ కానిస్టేబుల్ తనపై కన్నేశాడని.. అదను కోసం కావాలనే తన పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను జాప్యం చేస్తూ వచ్చాడని.. అతని పేరు దేవేంద్రసింగ్ అని వరుస ట్వీట్లతో తన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు ట్వీట్లకు పలువురు ప్రముఖులు స్పందించారు. బాధ్యత గల ఉద్యోగం చేస్తూ ఇలా ప్రవర్తించింనందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. 

loader