Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం.. ఆ పార్టీ నుంచి సీఎం కాబోతున్నదెవరంటే ?

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. 39 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నుంచి సీఎం పదవిని ఎవరు అధిరోహించబోతున్నారనే కుతూహలం అందరిలో నెలకొంది. 

 

Congress victory in Himachal Pradesh.. Who is going to become CM from that party?
Author
First Published Dec 8, 2022, 3:01 PM IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 68 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 39 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించగా.. ముగ్గురు ఇతర పార్టీల నుంచి గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది.

తాజా ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేపట్టడం ఖాయమైపోయింది. దీని కోసం పార్టీ ఏర్పాట్లు కూడా చేయడం ప్రారంభించింది. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున సీఎం కాబోతున్నది ఎవరన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికైతే సీఎం రేసులో ఆ పార్టీ నేతలు ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు. 

గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్.. ముహుర్తం ఖరారు.. హాజరుకానున్న మోదీ, షా..

అయితే ఆ నాయకుడి స్థాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు, కాంగ్రెస్ హైకమాండ్‌కు సామీప్యత వంటి అనేక అంశాల ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక ఉండవచ్చు. ప్రస్తుతం పోటీలో ఉన్న నాయకులు, వారి నేపథ్యం, బలాబలాలు, సానుకూలతలు ఒక సారి పరిశీలిద్దాం. 

ప్రతిభా సింగ్
మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. అయినప్పటికీ ఈ ఎన్నికల ప్రచార సమయంలో వీరభద్ర సింగ్ వారసత్వాన్ని తగిన గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ నొక్కి చెప్పింది. దీంతో ఆమె హిమాచల్ ప్రదేశ్ తదుపరి సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

సుఖ్విందర్ సింగ్ సుఖు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ అధిపతిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు పని చేశారు. ఆయన కూడా సీఎం పదవికి పోటీగా ఉన్నారు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. వీరభద్ర సింగ్ కుటుంబానికి ప్రత్యర్థిగా భావిస్తున్నారు. సుఖు ఈ సారి నదౌన్ అసెంబ్లీ ఎన్నికల నుంచి పోటీలో ఉన్నారు.

దారుణం.. మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి.. కంటైనర్ ట్రక్కులో గ్యాంగ్ రేప్

ముఖేష్ అగ్నిహోత్రి
అగ్నిహోత్రి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వీరభద్ర సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిభా సింగ్ సమర్థించే అవకాశం ఉంది. 

ఠాకూర్ కౌల్ సింగ్
77 ఏళ్ల ఠాకూర్ కౌల్ సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలోని దర్రాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరభద్ర సింగ్ కుటుంబ విధేయుడు గా ఉన్నారు. వీరభద్ర సింగ్ మరణానంతరం ప్రతిభా సింగ్‌తో బలంగా నిలబడి తన విధేయతను ప్రదర్శించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి 2017లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం కౌల్ పోటీలో ఉన్నారు. 

గుజరాత్ ఎన్నికల ఫలితాలు.. ఆప్ ఇక జాతీయ పార్టీ - ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

ఆశా కుమారి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా డల్హౌసీ ఎమ్మెల్యే ఆశా కుమారి ఉన్నారు. ఆమె బలమైన మహిళా అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఆమె కూడా సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ఆశా కుమారి ఛత్తీస్‌గఢ్ మంత్రి టీఎస్ సింగ్ సోదరి. అలాగే హిమాచల్ సీఎం పదవికి హర్షవర్ధన్ చౌహాన్, రాజేష్ ధర్మాని పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios