Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి.. కంటైనర్ ట్రక్కులో గ్యాంగ్ రేప్ 

బీహార్ లోని గయా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటనను చెబుతున్నారు. మైనర్ పాలు సేకరించేందుకు వెళ్తుండగా బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు తుపాకీతో బాలికను బెదిరించి.. పక్కనే ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు నిందితులు ఆమెపై అత్యాచారం చేసి బెదిరించి వదిలేశారు.

13-year-old girl gang-raped in container used for ferrying animals in Bihar Gaya
Author
First Published Dec 8, 2022, 2:27 PM IST

బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి.. బలవంతంగా లాక్కెళ్లారు. జంతువులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే కంటైనర్ ట్రక్కులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఆ బాలిక ప్రతిఘటించడంతో బాలిక చేతికి తీవ్ర గాయమైంది. వివరాల్లోకెళ్లే..  గయా జిల్లాలోని అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికను ముగ్గురు యువకులు తుపాకీతో బెదిరించి.. బలవంతంగా లాక్కెళ్లారు.

పక్కనే ఆగి ఉన్న వ్యక్తులు జంతువులను తీసుకెళ్లేందుకు ఉపయోగించే కంటైనర్ ట్రక్కులో సామూహిక అత్యాచారం చేశారు. వారి లైంగిక వేధింపులను ప్రతిఘటించడంతో బాలిక చేతులకు కూడా గాయమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నవంబర్ 30న జరిగినప్పటికీ.. ఈ ఘటన గురించి బయటకు చెప్పవద్దని నిందితులు తమను బెదిరించారని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని కుటుంబ సభ్యులు మంగళవారం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు . 

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బాధితురాలు పాలు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా  లాక్కెళ్లి.. ఆపి ఉంచిన కంటైనర్ ట్రక్కులో అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక వారిని ప్రతిఘటించింది. దీంతో ఆమె చేతికి తీవ్రగాయమైంది. అయినా.. వారు విడిచిపెట్టకుండా విచక్షణారహితంగా దాడి చేసి.. తన కామవాంఛను తీర్చుకున్నారు. ఈ దాడిలో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో అక్కడే విడిచిపోయారు. స్థానికుల సహాయంతో ఇంటికి చేరుకుంది.

పరువుపోతుందనీ, నిందితులు చంపేస్తామని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాప్యం చేశారు. అనంతరం పలువురి సలహా మేరకు నిందితులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక బెదిరించిన ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరు డ్రైవర్ కాగా, మరో ఇద్దరు కూలీలు. నిందితులు ముగ్గురూ 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని, బాధితురాలు నిరుపేద కుటుంబానికి చెందినదని SHO తెలిపారు.

12 ఏండ్ల బాలుడిపై విచక్షణారహితంగా దాడి.. ప్రైవేట్ బాడీ పార్ట్స్ ను కోసివేసిన దుండగులు

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అలీరాజ్‌పూర్ జిల్లాలోని పంకజ్ థామోర్ అనే గ్రామంలో 12 ఏండ్ల బాలుడిపై విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం అతని ప్రైవేట్  బాడీ పార్ట్స్ ను తెగ నరికారు.  విషయమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..గుజరాత్ లోని జామ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం గత 6 సంవత్సరాలుగా అలీరాజ్‌పూర్ జిల్లా పంకజ్ థామోర్ అనే గ్రామంలో నివసిస్తుంది. ఆ కుటుంబానికి చెందిన 12 ఏండ్ల బాలుడు మంగళవారం రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.కానీ, ఇంటికి తిరిగి రాలేదు. ఈ దశలో తల్లిదండ్రులు పనిచేస్తున్న పొలం పక్కనే మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందింది.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాలుడి ప్రైవేట్ పార్ట్స్ లభ్యమయ్యాయి. బాలుడి శరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే.. చెరకు కోసేందుకు ఉపయోగించే బిల్ హుక్ ను హత్యాయుధంగా వాడినట్లు తెలుస్తోంది. ఈ ఆయుధంతో బాలుడి తలపై కొట్టారు. ఆ తరువాత అతని ప్రైవేట్ భాగాలు కత్తిరించారని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios