Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అడుగులు.. సిమ్లాలో ఎమ్మెల్యేలతో మీటింగ్

హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రారంభించింది. నేడు సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో శాసన సభా పక్షనేతను ఎంపిక చేయనున్నారు. 

Congress steps towards forming government in Himachal.. Meeting with MLAs in Shimla
Author
First Published Dec 9, 2022, 1:10 PM IST

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శుక్రవారం సిమ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం ఇస్తూ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.

ఖాకీ వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌ .. ఐపీఎస్‌ అమిత్ లోధాపై అవినీతి ఆరోపణలు .. ఇంతకీ ఆయన ఎవరు?

ఇంత వరకు హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారపార్టీగా ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలను చేజిక్కిచుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే 1985 నుండి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికీ ఓటు వేయకూడదనే సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తిరిగి అమలు చేశారు. కాంగ్రెస్ కు ఘన విజయ అందించారు.

అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరుకావాలంటూ లేఖ రాసి కార్మికుడు సూసైడ్.. ఎక్కడంటే ?

పార్టీని నియంత్రణలో ఉంచుకొనే నాయకుడిని సీఎంగా ఎంపిక చేయడం ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద సవాలు.ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్నారు. అలాగే పార్టీ మాజీ చీఫ్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు, ప్రస్తుత సీఎల్పీ నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా గురువారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 10 హామీలను నెరవేర్చేందుకు పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్నారు.

15 స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు.. 126 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన ఆప్ ..

‘‘ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫలితాల అనంతరం శుక్రవారం సిమ్లాలో సమావేశమై కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవడంపై నిర్ణయం తీసుకుంటారు’’ అని శుక్లా గురువారం వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు. సీఎల్పీ నేతను నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ ఎమ్మెల్యేలు తీర్మాణాన్ని ఆమోదించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కాగా.. పార్టీ ఇద్దరు పరిశీలకులైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, హర్యానాకు చెందిన సీనియర్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా శుక్రవారం సిమ్లాకు చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios