Asianet News TeluguAsianet News Telugu

15 స్థానాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు.. 126 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన ఆప్ ..

గుజరాత్‌ ప్రజలు అధికార పార్టీ బీజేపీకే మళ్లీ పట్టం కట్టారు. దీంతో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీలోని 182 సీట్లలో 156 స్థానాలను దక్కించుకుని అఖండ  విజయాన్ని సాధించింది. నమోదైన మొత్తం ఓట్లలో 53 శాతానికి పైగా ఓట్లు బీజేపీకే వచ్చాయి. అదే సమయంలో రాష్ట్రంలో నోటాకు కూడా భారీగా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,01,202 మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని తీర్పునిచ్చారు. అంటే.. మొత్తం నమోదైన పోలింగ్‌ శాతంలో 1.5 శాతం ఓట్లు నోటే పడ్డాయి. 

Gujarat election 2022: Over 9% fall in NOTA votes recorded than last election
Author
First Published Dec 9, 2022, 10:54 AM IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వరుసగా ఏడో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాపై స్వారీ చేస్తూ.. గత ఎన్నికల్లో  ఉన్న రికార్డులను తిరగరాస్తూ..  రాష్ట్రంలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల పనితీరు చాలా దారుణంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 13 శాతం ఓట్లు పోలయ్యాయి.

అదే సమయంలో కేవలం  5 స్థానాల్లో విజయం సాధించారు. అదే సమయంలో రాష్ట్రంలో నోటాకు కూడా భారీగా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,01,202 మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని తీర్పునిచ్చారు. అంటే.. మొత్తం నమోదైన పోలింగ్‌ శాతంలో 1.5 శాతం ఓట్లు నోటే పడ్డాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఈ సారి నోటా ఓటు శాతం తగ్గిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2017లో ఏకంగా 5,51,594 ఓట్లు నోటాకు పడ్డాయట. 


మరోలా చూస్తే.. ఆప్ పోటీ చేసిన ప్రాంతాల్లో 15 స్థానాల్లో ఆప్ నోటా కంటే ఓట్లు నమోదయ్యాయి. ఆప్ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన 15 నియోజకవర్గాల్లో అబ్దాసా, రాపర్, వావ్, థరద్, ధనేరా, రాధన్‌పూర్, ఖేరాలు, కలోల్, ఖంభాత్, బోర్సాద్, అంక్లావ్, మాటర్, పద్రా, వాగ్రా , సూరత్ ఈస్ట్ లు ఉన్నాయి. అలాగే..  గుజరాత్‌లోని 7 నియోజకవర్గాల్లో నోటా మూడో స్తానంలో నిలించింది. రాపర్, తరద్, రాధన్‌పూర్, కలోల్, బోర్సాద్, అంక్లావ్,  వాగ్రా ఈ ఏడు స్థానాల్లో నోటా (ఓట్ల పరంగా) మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు మాత్రమే నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 

మరోవైపు.. ఖేద్‌బ్రహ్మ నియోజకవర్గంలో నోటాకు అత్యధిక ఓట్లు వచ్చాయి. మొత్తం 7,331 (3.56%) ఓటర్లు నోటా బటన్‌ను నొక్కారు. ఇక డాంటాలో 5213 ఓట్లు, ఛోటా ఉదయ్‌పూర్‌లో 5093, దేవ్గధ్‌బారియాలో 4821, షెహ్రాలో 4708, నైజర్‌లో 4465, బర్డోలిలో 4211, వడోదరా సిటీ నియోజకవర్గంలో 4022 ఓట్లు నోటా గుర్తుకు పోలయ్యాయి. ఇది కాకుండా కరంజ్‌లో నోటాకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. కరంజ్‌లో 756 మంది మాత్రమే నోటా బటన్‌ను నొక్కారు. 

గుజరాత్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 182 మంది అభ్యర్థుల్లో 126 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అదే సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో 35 స్థానాల్లో రెండవ స్థానంలో నిలిచింది. 2022లో ఆప్ గెలిచిన 5 స్థానాల్లో 2017లో బీజేపీకి 2, కాంగ్రెస్‌కు 2, బీటీపీకి 1 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 156, కాంగ్రెస్‌కు 17, ఆప్‌కి 5, ఇతరులకు 4 సీట్లు వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios