IPS Amit Lodha: బీహార్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోధాపై అవినీతి ఆరోపణలపై వివాదం మొదలైంది. ఆయన మగధ్ రేంజ్ ఐజీ ఉన్న సమయంలో అవినీతి, ఆర్థిక అవకతవకల పాల్పడినట్టు బీహార్ స్పెషల్ విజిలెన్స్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

IPS Amit Lodha: బీహార్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలపై వివాదం మొదలైంది. ఆయన మగధ్ రేంజ్ ఐజీ ఉన్న సమయంలో అవినీతి, ఆర్థిక అవకతవకల పాల్పడినట్టు బీహార్ స్పెషల్ విజిలెన్స్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆయన ప్రభుత్వ పదవిలో ఉంటూ.. వ్యాపారం చేశారని స్పెషల్ విజిలెన్స్ యూనిట్ ఆరోపణలు చేసింది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ యూనిట్ కూడా ఆరోపించింది. అమిత్ లోధా రాసిన 'బీహార్ డైరీ' అనే పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డిసెంబర్ 2018)ప్రచురించింది. ఈ పుస్తకం ఆధారంగానే 'ఖాకీ' అనే వెబ్‌ సిరీస్‌ రూపొందింది. ఈ సిరీస్ కు మామూలు క్రేజ్ లేదు..చాలా మంది ప్రజలు ఇష్టపడుతున్నారు.

వెబ్ సిరీస్‌పై వివాదం

అమిత్ లోధా..మగద్ రేంజ్ ఐజిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పదవిలో ఉంటూ నెట్‌ఫ్లిక్స్, ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో కమర్షియల్ వర్క్ చేశారని బీహార్ స్పెషల్ విజిలెన్స్ యూనిట్ ఆరోపించింది. ఈ విషయంలో అమిత్ లోధాపై స్పెషల్ విజిలెన్స్ యూనిట్ 7 పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'ఖాకీ' వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ షేక్‌పురాకు చెందిన డాన్ అశోక్ మహ్తో యొక్క దోపిడీల ఆధారంగా రూపొందించబడింది.

ఆ సమయంలో షేక్‌పురా ఎస్పీగా అమిత్ లోధా ఉన్నారు. తన అనుభవాల ఆధారంగా బీహార్ డైరీ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఆధారంగానే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో 'ఖాకీ' వెబ్ సిరీస్ వచ్చింది. ఈ క్రమంలో అతనిపై అవినీతి, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై పోలీసు ప్రధాన కార్యాలయం, సీనియర్ అధికారులు దర్యాప్తు నివేదికను సమీక్షించారని స్పెషల్ మానిటరింగ్ యూనిట్ పేర్కొంది. ఇది కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. నెట్‌ఫ్లిక్స్-ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్నట్టు ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరిగింది.

ఆ తర్వాత స్పెషల్ మానిటరింగ్ యూనిట్ విచారణలో దొరికిన వాస్తవాలు, సాక్ష్యాధారాల ఆధారంగా డిసెంబర్ 7న ఐపీఎస్ లోధాపై స్పెషల్ మానిటరింగ్ యూనిట్ కేసు నమోదు చేసింది. ఖాకీ:ది బీహార్ చాప్టర్ వెబ్‌సిరీస్ కోసం సంస్థ నుండి డబ్బు తీసుకున్నట్లు గ్రాఫ్ట్ ఆరోపణలపై అతనిపై కేసు నమోదు చేశారు. ఆ సంస్థ నుంచి అతని భార్య ₹38.25 లక్షల నల్లధనం పొందిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అతనిపై ఐపీసీలోని 120బీ, 168 సెక్ష‌న్ల కింద FIR నమోదు చేయబడింది.

ఈ ఆరోపణలపై స్పందించిన అమిత్ లోధా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "కొన్నిసార్లు జీవితం చాలా కష్టమైన సవాళ్లను విసురుతుంది, ముఖ్యంగా మనం ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు .. ఈ సమయంలో మన పాత్ర యొక్క బలం ప్రతిబింబిస్తుంది. విజయం సాధించడానికి మీ ప్రార్థనలు మరియు మద్దతు అవసరం" అని ట్వీట్ చేశారు.

ఇంతకీ అమిత్ లోధా ఎవరు ?

అమిత్ లోధా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జైపూర్‌లో జన్మించిన ఆయన ఢిల్లీ ఐఐటీలో మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించారు. అయితే..IIT వాతావరణం తన స్వభావానికి నచ్చకపోవడంతో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడ్డారు. IIT జీవితంలోని ఎదుర్కొన్న అనుభవాలు ఆ తరువాత అతడ్ని యూపీఎస్సీ వైపు నడిపించాయి.

కేవలం 25 ఏండ్లలోనే యూపీఎస్సీ ట్రాక్ చేసి.. 1988లో ఐపీఎస్ (IPS) అధికారి అయ్యాడు. లోధా తొలి పోస్టింగ్ రాజస్థాన్‌. తనదైన శైలిలో కేసులను సాల్వ్ చేసేవాడు. ఏదైనా సమస్య ఉంటే.. తన ల్యాండ్‌లైన్ నంబర్‌కు నేరుగా కాల్ చేయమని ప్రజలకు చెప్పేవాడు. ఇలా ఆయనకు ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. ప్రముఖ IPS అధికారిగా గుర్తింపు పొందాడు. 

ఆ తరువాత అతడు బీహార్ కు బదిలయ్యాడు. అక్కడ 'గబ్బర్ సింగ్ ఆఫ్ షేక్‌పురా' కేసును చేధించడంతో అమిత్ లోధాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తుంపు వచ్చింది. ఇద్దరు పోలీసులను చంపడం.జైలు నుంచి పారిపోవడం, అనంతరం 15 మందిని హత్య చేయడం మొదలైన వాటిపై అనేక కేసులు ఉన్న భయంకరమైన మహ్తో గ్యాంగ్ (పింటు మహ్తో, అశోక్ మహ్తో)ను అమిత్ లోధా ట్రాక్ చేశాడు. అతని కేరీర్ లో ఎన్నో క్లిష్టమైన కేసులు సాల్వ్ చేశారు.ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్‌ వంటి పురస్కారాలను తన పోలీసు కెరీర్‌లో చేసిన అనేక కార్యకలాపాలకు గాను అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన బీహార్ IGP (ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా వ్యవహరిస్తున్నారు. అమిత్ లోధా యొక్క పుస్తకం బీహార్ డైరీస్ (2018). తన పుస్తకంలో మహతో పేరును పేర్కొననప్పటికీ అతని గ్యాంగ్‌ని వెంబడించాడు. ఈ పుస్తకం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ లో ఖాకీ ది బీహార్ చాప్టర్ అనే వెబ్ సీరిస్ రూపొందించింది. లోధా మరో పుస్తకం కూడా రాశారు.అదే.. లైఫ్ ఇన్ ది యూనిఫాం. ఇది 2021లో ప్రచురించబడింది. ఈ పుస్తకంలో అతని UPSC ప్రయాణం గురించి వివరించాడు.