Asianet News TeluguAsianet News Telugu

Lakhimpur Kheri violence: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్

లఖీంపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కోవింద్ అపాయింట్‌మెంట్ ను కాంగ్రెస్ కోరింది.

Congress seeks President's appointment to present detailed memorandum on Lakhimpur Kheri incident
Author
New Delhi, First Published Oct 10, 2021, 4:15 PM IST


న్యూఢిల్లీ: Lakhimpur Kheri ఘటనపై రాష్ట్రపతిని కలవాలని congress పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి Ram Nath Kovind అపాయింట్‌మెంట్ కొరకు ఆదివారం నాడు లేఖ రాసింది.Rahul gandhi నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం తీసుకొంది.రాష్ట్రపతిని కలిసే బృందంలో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ,ఏకే అంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్,  అధిర్ రంజన్ చౌధురిలు ఉంటారు.

also read::Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్

గత ఆదివారం నాడు లఖీంపూర్ ఖేరీ వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ  విషయమై  పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు అనుమతివ్వాలని ఆ లేఖలో కాంగ్రెస్ కోరింది. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి ajay mishra తనయుడు ashish mishra ను శనివారం నాడు రాత్రి యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

14రోజుల జ్యూడిషీయల్ కస్టడీకి మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాను పంపారు.ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు లువ్, ఆశిష్ పాండేలను పోలీసులు అరస్ట్ చేశారు.ఈ నెల 6వ తేదీన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు లఖీంపూర్ ఖేరీలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

లఖీంపూర్ ఖేరీ ఘటనపై యూపీ ప్రభుత్వంతో పాటు, యూపీ పోలీసులపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. సాక్ష్యాలను కాపాడాలని కూడ డీజీపీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios