Asianet News TeluguAsianet News Telugu

సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ కీలక భేటీ… పార్లమెంట్ సమావేశాలపై చర్చ..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక భేటీ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. పార్లమెంట్ స్ట్రాటజిక్ గ్రూప్ సభ్యుల భేటిలో పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలను గురించి ఎంపీలకు సోనియా దిశానిర్దేశం చేయనున్నారు.

Congress partys parliamentary panel meets over Winter Session
Author
New Delhi, First Published Nov 25, 2021, 7:28 PM IST

ఈనెల 29 నుంచి పార్లమెంట్ శాతాకాల సమావేశాలు (parliament winter session) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అధికార బీజేపీ (bjp) సహా.. ప్రతిపక్షాలన్నీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై తమ గళం వినిపించేలా వ్యూహాలు రూపొందిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ (congress) పార్టీ కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా.. కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తుంది.

దీనిలో భాగంగా గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక భేటీ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. చర్చించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. పార్లమెంట్ స్ట్రాటజిక్ గ్రూప్ సభ్యుల భేటిలో పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలను గురించి ఎంపీలకు సోనియా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాలు.. పెట్రోల్ రేట్లు (petrol price), రైతు చట్టాలు (farm laws) , ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.

Also Read:Mamata Banerjee: ప్రతిసారీ సోనియా గాంధీని ఎందుకు కలవాలి?.. దీదీ కామెంట్స్.. పెద్ద హింటే ఇచ్చేశారుగా..

మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలపై లోక్ సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు 26 బిల్లులు ప్రవేశపెట్టి, చర్చించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లోనే మూడు కీలక ఆర్డినెన్స్ లు కూడా తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios