అత్యంత విషపూరిత రసెల్ వైఫర్ పామును పట్టిన ఎమ్మెల్యే (వీడియో)

Congress Opposition Leader Paresh Dhanani's Snake Caught Video Viral
Highlights

గుజరాత్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన సాహసకృత్యంతో వార్తల్లో నిలిచాడు. తన నివాసంలోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన పామును ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఒట్టి చేతులతోనే పట్టుకున్నాడు.  ఇలా ఎమ్మెల్యే పామును పడుతుండగా అక్కడే ఉన్న సిబ్బంది వీడియో తీశారు. దీన్ని స్వయంగా ఎమ్మెల్యే తన ట్విట్టర్ లో పోస్టు చేయగా ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్ అమ్రేలీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని...గాంధీనగర్ లోని అధికారిక నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే అతడి నివాసంలోకి ఓ విషపూరిత రసెల్స్ వైఫర్ పాము వచ్చింది. దీన్ని గమనించి బయపడిపోయిన సిబ్బంది ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అతడు ఎలాంటి రక్షణ లేకుండానే ఒట్టి చేతులతోనే ఆ పామును పట్టుకున్నాడు. దాని తోకను పట్టుకుని పామును నియంత్రిస్తున్న వీడియోను పరేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఇలా ఓ ఎమ్మెల్యే చేసిన సాహసాన్ని చూసిన వారు ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పామును చంపకుండా సురక్షితంగా పట్టుకుని వదిలేసిన అతడి జంతుప్రేమను కూడా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎలాగైతేనేం ఓ మంచి పని, సాహసం చేసి ఈ గుజరాత్ ఎమ్మెల్యే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
loader