Asianet News TeluguAsianet News Telugu

18 ఏళ్లు దాటిన వారికి టీకా.. అది కూడా నోట్ల రద్దు లాంటిదే: రాహుల్ వ్యాఖ్యలు

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. జాతినుద్దేశిస్తూ నిన్న ప్రధాని మోడీ ప్రసంగాన్ని టార్గెట్‌గా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు

congress mp rahul gandhi slams centres vaccine drive policy ksp
Author
New Delhi, First Published Apr 21, 2021, 2:29 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. జాతినుద్దేశిస్తూ నిన్న ప్రధాని మోడీ ప్రసంగాన్ని టార్గెట్‌గా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని 18 ఏళ్లు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామన్న ఈ వాగ్దానం నిజంగా పేదలకు ఉపయోగపడేది కాదని రాహుల్ ఆరోపించారు. ఇది పూర్తిగా కొద్ది మంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమేనని ఆయన ఎద్దేవా చేశారు.

అంతే కాకుండా టీకా పాలసీ.. నోట్ల రద్దు లాంటి నిర్ణయానికి ఏమాత్రం తీసిపోదని, పెద్ద నోట్లు మార్చుకోవడానికి సాధారణ ప్రజలు లైన్లలో వేచి ఉన్నట్లే టీకా కోసం కూడా భారీగా లైన్లు ఉంటాయని రాహుల్ జోస్యం చెప్పారు. 

Also Read:అది చివరి అస్త్రంగానే వాడాలి... లాక్‌డౌన్ లేనట్లే: తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్రమోడీ

కేంద్ర ప్రభుత్వ టీకా పాలసీ మరో నోట్లరద్దుకు ఎంత మాత్రం తక్కువ కాదని... సాధారణ ప్రజలు లైన్లలోనే ఉండిపోతారని ఆయన ట్వీట్ చేశారు. డబ్బు, ఆరోగ్యం, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని.. చివర్లో కొద్ది మంది వ్యాపారవేత్తలు మాత్రమే లాభపడతారని రాహుల్ ఆరోపించారు,

కాగా, దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందని మంగళవారం నాటి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. దేశంలో సెకండ్ వేవ్ విజృంభణపై ఆయన కొన్ని సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios