ప్రధాని నరేంద్ర మోడీపై (Narendra modi) మండిపడ్డారు కాంగ్రెస్ (congress) జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (priyanka gandhi). ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారణాసిలో (varanasi) ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు
ప్రధాని నరేంద్ర మోడీపై (Narendra modi) మండిపడ్డారు కాంగ్రెస్ (congress) జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (priyanka gandhi). ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారణాసిలో (varanasi) ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం ఆమె ప్రసంగాన్ని శ్లోకాలతో ప్రారంభించారు. ఈ రోజు నవరాత్రులలో నాల్గవ రోజు.. తాను ఉపవాసం పాటిస్తున్నానని.. తాను మాత స్తుతితో మొదలుపెట్టాలనుకుంటున్నాను ప్రియాంక గాంధీ చెప్పారు. ఇది నవరాత్రుల సమయం కాబట్టి తన హృదయంతో మాట్లాడాలని అనుకున్నాను అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. లఖింపూర్‌లో ఇంతటి దుర్ఘటన జరిగిన తర్వాత కూడా మోడీ లక్నో వచ్చివెళ్లారేగానీ.. రైతులను ఎందుకు పరామర్శించలేదని ఆమె నిలదీశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికిపైగా నిరసన చేస్తున్నా వారితో మాట్లాడేందుకు మోడీకి సమయం లేదని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు.
Also Read:Lakhimpur Kheri violence: కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా అరెస్ట్
లఖింపూర్ ఖేరీ (lakhimpur kheri ) ఘటనకు సంబంధించిన కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను (ashish mishra) యోగి ప్రభుత్వం (yogi adityanath) కాపాడుతోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేవరకు తాను, కాంగ్రెస్ (congress) పోరాడుతామని, జైల్లో పెట్టి కొట్టినా సరే పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. లఖింపూర్ కేసు విచారణ సాఫీగా సాగాలంటే అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, వారి కార్పొరేట్ మిత్రులకు తప్ప దేశంలో మిగిలిన వారికి భద్రత లేదని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఈ దేశం మోడీ లేదా ఏ కొందరిదో కాదన్న నిజాన్ని గుర్తుంచుకుని అధికార మార్పు కోసం ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోంటే మోడీ మాత్రం తనకోసం ప్రత్యేకంగా వందల కోట్లతో విమానాలు చేయించుకున్నారని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఇది చాలదన్నట్లు ప్రభుత్వరంగ సంస్థలను ఎడాపెడా అమ్మేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
