Asianet News TeluguAsianet News Telugu

"పాకిస్థాన్‌ను భారత్ గౌరవించాలి. లేకపోతే.. " : మణిశంకర్ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు

Mani Shankar Aiyar: వారసత్వపు పన్ను, భారతీయులపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శామ్ పిట్రోడా కామెంట్స్ మరిచిపోకముందే.. తాజా మరో కాంగ్రెస్ నేత ప్రకటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌పై ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Congress leader Mani Shankar Aiyar says Respect Pak or they will drop atom bomb KRJ
Author
First Published May 10, 2024, 9:56 AM IST

Mani Shankar Aiyar: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారసత్వపు పన్ను, భారతీయులపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శామ్ పిట్రోడా కామెంట్స్ మరిచిపోకముందే.. తాజా మరో కాంగ్రెస్ నేత ప్రకటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌పై ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉన్నందున భారత్ గౌరవించాలని మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఇది మాత్రమే కాదు.. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని అన్నారు. అయ్యర్ ప్రకటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మణిశంకర్ అయ్యర్‌కు పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ మరోసారి మేల్కొందని అన్నారు. పాకిస్థాన్‌పై కాంగ్రెస్‌ ప్రేమ అంతం కాదని బీజేపీ నేత షాజాద్‌ పూనావాలా అన్నారు.

ఇంతకీ మణిశంకర్ అయ్యర్ ఏమన్నారంటే..

మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'భారతదేశం పాకిస్తాన్‌ను గౌరవించాలి, ఎందుకంటే దాని వద్ద అణుబాంబు ఉంది. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుబాంబు ప్రయోగించాలని వారు ఆలోచిస్తారు. పాకిస్థాన్‌ లోని రావల్పిండి లో అణుబాంబు ఉందన్న విషయాన్ని మరువకూడదు.పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఉంది. కాబట్టి వారి మాట్లాడబోమని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చెబుతుందో అర్థం కావడం లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమని అర్థం చేసుకోవాలి. లేకుంటే భారత్ దురహంకారంతో ప్రపంచంలో మనల్ని చిన్నచూపు చూస్తున్నదని పాకిస్థాన్ భావిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని ఏ పిచ్చివాడైనా ఈ బాంబులను ప్రయోగించవచ్చు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని బీజేపీ చెబుతోందని అయ్యర్ అన్నారు. అయితే చర్చల ద్వారానే ఉగ్రవాదం అంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మణిశంకర్ అయ్యర్ ప్రకటన తెగ వైరల్ అవుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios